దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ లో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా తొలి మ్యాచ్ లో దాయాది దేశం పాకిస్థాన్ పై ఘన విజయం సాధించింది..150 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మూడు వికెట్లు నష్టపోయి 151 పరుగులు చేసింది.. జెమియా రోడ్రిగ్స్ 53 , రిచా శర్మ 31 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.. ఒక ఓవర్ మిగిలి ఉండగానే భారత్ టార్గెట్ ను చ్చేధించింది.. ఓపెనర్ షఫాలీ వర్మ 33, కెప్టెన్ హర్మన్ ప్రీత్ 17, ఓపెనర్ యస్తిక భాటియా 17 పరుగులు చేశారు.. 53 పరుగులు చేసి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన రోడ్రిగ్స్ కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది
అంతకు ముందు టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ధారిత 20 ఓవర్లలో పాక్ నాలుగు వికెట్లు నష్టపోయి 149 పరుగులు చేసింది.. భారత్ విజయం కోసం 150 పరుగులు చేయాల్సి ఉంది.. 12 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పొయి 68 పరుగులు చేసిన పాక్ ను మరూఫ్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఆయేషాలు ఆదుకున్నారు.. ఈ ఇద్దరు చివరి 8 ఓవర్లలో 81 పరుగులు జోడించారు.. ఆయేషా 25 బంతులలో 43 పరుగులు చేయగా, మరూఫ్ 55 బంతులలో 68 పరుగులు చేసింది.. భారత్ బౌలర్ల్ లో పూజ, దీప్తీలకు ఒక్కో వికెట్ లభించగా, రాధాయాదవ్ కు రెండు వికెట్లు దక్కాయి.