రాయ్‌పూర్: న్యూజిల్యాండ్ పై జరిగిన రెండో వన్డే లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయంసాధించింది.. 109 పరుగుల లక్ష్యాన్ని 20.1 ఓవర్లలో 111 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పొయి ఛేదించింది.. రోహిత్ శర్మ 51పరుగులకు, కోహ్లీ 11 పరుగులకు అవుటయ్యారు.. గిల్ 40, ఇషాన్ కిషన్ 8 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.. మూడు వన్డేల సిరీస్ లో ఈ విజయంతో 2 – 0తో భారత్ అధీక్యంలో ఉంది..
అంతకు ముందు న్యూజిలాండ్ బ్యాటర్ లు పూర్తిగా విఫలమయ్యారు.. ఓవర్లలో పరుగులకు అలౌటైంది.. టాప్ ఆర్డర్ లో ఒక్క బ్యాటర్ కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు.. భారత్ పేస్ బౌలర్లు షమీ,సిరాజ్, శార్డూల్, హర్ధిక్ లు అద్భుతంగా బౌలింగ్ చేశారు..రాయపూర్ లో ప్రారంభమైన రెండవ వన్డేలో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నది. రాయ్‌పూర్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ చేయడానికి డిసైడ్ అయ్యాడు. బౌలింగ్ నిర్ణయం సరైనదేలా భారత్ పేస్ బౌలర్లు టపటప వికెట్లు పడగొట్టారు.. బ్యాటింగ్ కు దిగిన కివీస్ కు రెండో ఓవర్ లోనే దెబ్బ తగిలింది..షమీ వేసిన తొలి ఓవర్ అయిదో బంతికి కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్ డకౌట్ అయ్యాడు.ఆ తర్వాత సిరాజ్ తన మూడో ఓవర్ లో నికోలస్ ను పెవిలియన్ కు పంపాడు.. ఆ తర్వాత షమీ తన నాలుగో ఓవర్ లో డెరియల్ మిచెల్ ను వెనక్కి పంపాడు .
హర్థిక్ తన తొలి ఓవర్ లోనే కాన్వేను ఔట్ చేశాడు. ఆ తర్వాత శార్దూల్ కూడా తన తొలి ఓవర్ లోనే కివీస్ స్కిపర్ టామ్ లాథమ్ వికెట్ తీసుకున్నాడు.. బ్రాస్ వెల్,శాట్నర్, గ్లెన్ ఫిలిప్స్ లు కాస్త భారత్ బౌలింగ్ ను ప్రతిఘటించినా భారీ స్కోర్ చేయడంలో విపలమయ్యారు.. కివీస్ బ్యాటర్ లు పిన్ అలెన్ డక్, డేవిన్ కాన్వే 7, హెన్రీ నికోలస్ 2, డెరియల్ మిచెల్ 1, టామ్ లాథమ్ 1, గ్లెన్ ఫిలిప్స్ 36, బ్రాస్ వెల్ 22, శాట్నర్ 27, ఫెర్గుసన్ 1, బ్లైర్ థిక్నర్ 2 పరుగులు చేశారు.. షమీకి మూడు వికెట్లు సాధించగా, హర్థిక్, వాషిగ్టంన్ సుందర్ లకు తలో రెండు వికెట్లు దక్కాయి.. శార్దూల్, సిరాజ్ , కులదీప్ లు ఒక్కో వికెట్ పడగొట్టారు.