వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఇవ్వాల్టి నుంచి జరిగే టీ20 సిరీస్‌ను కూడా తమ ఖాతాలో వేసుకోవాలని ఉర్రూతలూగుతోంది. బుమ్రా, కోహ్లీ వంటి సీనియర్లు లేకున్నా కుర్రాళ్లు జట్టులో మంచి కసిమీద ఉన్నారు. కాగా, జట్టును గెలిపించే బాధ్యతను రోహిత్ శర్మ తన భుజాలపై వేసుకున్నాడు. ఈ క్రమంలో ఇవ్వాల ట్రినిడాడ్‌లోని బ్రయాన్ లారా స్టేడియం వేదికగా తొలి మ్యాచ్‌కు టాస్ జరిగింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్ సారధి నికోలస్ పూరన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టు మొదటగా బ్యాటింగ్ చేయనుంది. ఇంగ్లండ్‌లో చేసినట్లే రోహిత్ శర్మతో కలిసి రిషభ్ పంత్ జట్టు ఓపెనింగ్ బాధ్యతలు పంచుకోనున్నాడు. గాయం నుంచి కోలుకున్న జడేజా కూడా జట్టులో చేరగా.. చాలా రోజుల తర్వాత టీ20 ఫార్మాట్లో అశ్విన్ ఆడుతున్నాడు.