దుబాయ్ : ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సత్తా చాటాడు. ఒక స్థానానికి మెరుగుపర్చుకుని నాలుగో ర్యాంకుకు చేరాడు. రాహుల్ ఖాతాలో 729 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇక సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. పదో ర్యాంకులో కొనసాగుతున్నాడు. అతని ఖాతాలో 657 రేటింగ్ పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ 11వ ర్యాంకులో ఉన్నాడు. ఇక బౌలర్ల జాబితాలో టాప్ 10లో టీమిండియా ఆటగాళ్లు ఎవరికీ చోటు దక్కలేదు. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ 20వ ర్యాంకులో ఉండగా.. పేస్ గన్ జస్ప్రిత్ బుమ్రా 26వ ర్యాంకులో ఉన్నాడు. అటు ఆల్ రౌండర్ల జాబితాలో కూడా టాప్ 10లో భారత్ ఆటగాళ్లకు ఎవరికీ చోటు దక్కలేదు.
పాక్ బ్యాటర్ బాబర్ అజామ్ టాప్..
టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ నెంబర్ స్థానంలో కొనసాగుతున్నాడు. అతని ఖాతాలో 805 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఆ తరువాత రెండో స్థానంలో పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజాన్ ఉన్నాడు. అతని ఖాతాలో 798 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. మూడో స్థానంలో దక్షిణాఫ్రికా బ్యాటర్ ఐడెన్ మార్క్రామ్ ఉన్నాడు. అతని ఖాతాలో 796 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఐదో స్థానంలో ఇంగ్లండ్ బ్యాటర్ డేవిడ్ మలాన్ ఉన్నాడు. అతని ఖాతాలో 728 పాయింట్లు ఉన్నాయి. ఇంతకుముందు నాల్గో ర్యాంకులో ఉన్న భారత్ బ్యాటర్.. కేఎల్ రాహుల్ ఆ స్థానాన్ని ఆక్రమించడంతో ఐదో స్థానానికి పడిపోయాడు. ఆరో స్థానంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఉన్నాడు. అతని ఖాతాలో 709 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇక ఏడో స్థానంలో న్యూజిలాండ్ బ్యాటర్ డేవిడ్ కానే ఉన్నాడు. అతని ఖాతాలో 703 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. 8వ స్థానంలో దక్షిణాఫ్రికా బ్యాటర్ డసెన్ (669 రేటింగ్ పాయింట్లు) ఉన్నాడు. 9వ స్థానంలో 658 రేటింగ్ పాయింట్లతో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ ఉన్నాడు.
బౌలర్స్‌లో హసరంగ టాప్..
ఇక బౌలర్ల జాబితాలో శ్రీలంక బౌలర్ హసరంగ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. అతని ఖాతాలో 797 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. రెండో ర్యాంకులో సౌతాఫ్రికా బౌలర్ షంసీ ఉన్నాడు. ఇతని ఖాతాలో 784 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇంగ్లండ్ బౌలర్ ఆదిల్ రషీద్ ఖాతాలో 746 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. నాల్గో స్థానంలో ఆస్ట్రేలియా పేసర్ ఆడమ్ జంపా (725 రేటింగ్ పాయింట్లు) ఉన్నాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..