Sunday, November 10, 2024

పెవిలియన్‌కి టీమిండియా క్యూ..

మంగళవారం ఐదోరోజు 39/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆటను ప్రారంభించిన భారత్‌ను లీచ్‌, అం డర్సన్‌ దెబ్బ తీశారు. ఆదుకుంటారని భావించిన పుజారా (15), రహానె (0), పంత్‌ (11), సుందర్‌ (0) పూర్తిగా విఫలమయ్యారు. తొలుత గిల్‌, పుజారా భారత ఇన్నింగ్స్‌ను పటిష్ఠం చేస్తారని అభిమానులు ఆశించారు. ఈ క్రమంలో జాక్‌లీచ్‌ పుజారాను ఔట్‌ చేసి షాక్‌ ఇచ్చాడు. లీచ్‌ బౌలింగ్‌లో బంతి బ్యాట్‌ అం చును తాకి నేరుగా స్లిప్‌లో ఉన్న స్టోక్స్‌ చేతిలో పడిం ది. దీంతో భారత్‌ 58పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. అనంతరం నాలుగోస్థానంలో కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. గిల్‌ అర్ధశతకం పూర్తవగానే అం డర్సన్‌ బౌలింగ్‌కు దిగి గిల్‌ (50), రహానె (0) బౌల్డ్‌ చేశాడు. దీంతో ఒత్తిడిలో పడిన టీమిండియా వరు సగా వికెట్లు పారేసుకుంది.
ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో వైపు కోహ్లీ ఒంటరి పోరాటం చేశాడు. అయితే కోహ్లీకి మరో ఎండ్‌ నుంచి సహకారం లేకపోయింది. ఈ క్ర మంలో అశ్విన్‌ (9) క్రీజులో అండగా నిలవ డంతో 7వ వికెట్‌కు 54పరుగులు వచ్చాయి. లీచ్‌ అశ్విన్‌ను ఔట్‌చేయగా.. 104బంతుల్లో 9ఫోర్లుతో 72 పరు గులు చేసిన కోహ్లీని స్టోక్స్‌ బౌల్డ్‌ చేయడంతో టీమిం డియా కోలుకోలేకపోయింది. నదీమ్‌ (0), బుమ్రా (4) త్వర గానే ఔటవడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. మొత్తంమీద టీమిండియా సెకం డ్‌ ఇన్నిం గ్స్‌లో 192పరుగులకు ఆలౌటైంది. ఇం గ్లండ్‌ 227పరుగులు భారీ విజయాన్ని అందు కుంది. తొలిఇన్నింగ్స్‌లో 218 పరుగులతో డబుల్‌ సెంచ రీ చేసి ఇంగ్లండ్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన జోరూట్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement