Wednesday, November 13, 2024

వన్డే క్రికెట్‌ చరిత్రలో ఒకే ఒక్కడు..

టీమిండియా మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఓ రికార్డు సృష్టించాడు. విండీస్‌తో జరిగిన రెండో వన్డేలో 83 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 64 పరుగులు చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌.. ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

వన్డే క్రికెట్‌ చరిత్రలో తొలి ఆరు మ్యాచుల్లో 30కు పైగా పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. గతంలో నెదర్లాండ్స్‌ ఆటగాళ్లు ర్యాన్‌ టెన్‌ డస్కటే, టామ్‌ కూపర్‌, పాక్‌ ఆటగాడు ఫఖర్‌ జమాన్‌లు తొలి ఐదు వన్డే ఇన్నింగ్స్‌లో 30కు పైగా పరుగులు చేశారు. తాజా మ్యాచ్‌తో సూర్యకుమార్‌ యాదవ్‌ వీరిని అధిగమించి ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో తన పేరును శాశ్వతం చేసుకున్నాడు. 6 మ్యాచుల్లో.. 65.25 సగటున 261 పరుగులు చేశాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement