Saturday, November 23, 2024

భారత హాకీ జట్టుకు అసలు పరీక్ష నేడే..

టోక్యో ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు ఇవాళ కీలక క్వార్టర్ ఫైనల్ లో ఇంగ్లాండ్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి సెమీస్ గండాన్ని అధిగమించాలని టీమిండియా భావిస్తోంది. గత 8 ఒలింపిక్స్ లలో టీమిండియా సెమీస్ గండంతోనే వెనుగుదురుగుతోంది. ఈ ఇవాళ్టీ ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై గెలిస్తే సేమీస్ కి వెళ్లడంతో పాటు పతకం రేసులో కూడా ఉంటుంది. 2016 రియో ఒలింపిక్స్‌లోనూ భారత జట్టు క్వార్టర్‌ ఫైనల్లోనే నిష్క్రమించింది. భారత పురుషుల హాకీ జట్టు చివరిసారి 1980 మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించింది. ఆ తర్వాత ఎనిమిదిసార్లు ఒలింపిక్స్‌ క్రీడల్లో పాల్గొన్నా టీమిండియా ఒక్కసారీ కూడా సెమీఫైనల్‌ దశకు అర్హత సాధించలేకపోయింది.

ఒలింపిక్స్‌లో ఇవాళ భారత మ్యాచుల వివరాలు ఇలా ఉన్నాయి:
పురుషుల హాకీ :
భారత్‌ vs బ్రిటన్‌(క్వార్టర్‌ ఫైనల్‌) సాయంత్రం గం. 5:30 నుంచి
బ్యాడ్మింటన్‌ : మహిళల సింగిల్స్‌ కాంస్య పతకం మ్యాచ్‌: పీవీ సింధు vs హి బింగ్‌ జియావో సాయంత్రం గం. 5 నుంచి
ఈక్వెస్ట్రియన్‌ : ఈవెంటింగ్‌ క్రాస్‌ కంట్రీ టీమ్‌ అండ్‌  ఇండివిడ్యుయల్‌:  ఫౌద్‌ మీర్జా ఉదయం గం. 4:15 నుంచి
గోల్ఫ్‌:
పురుషుల వ్యక్తిగత స్ట్రోక్‌ ప్లే రౌండ్‌–4: అనిర్బన్‌ లాహిరి, ఉదయన్‌ మానె (ఉదయం గం. 4 నుంచి)
బాక్సింగ్‌ : పురుషుల +91 కేజీల క్వార్టర్‌ ఫైనల్‌: సతీశ్‌ కుమార్‌ vs  జలోలోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌); ఉదయం గం 9:36 నుంచి 

ఇది కూడా చదవండి : ప్రత్యక్ష విచారణకు హైకోర్టు నిర్ణయం.. వ్యాక్సిన్ తీసుకున్న న్యాయవాదులకే అనుమతి

Advertisement

తాజా వార్తలు

Advertisement