Friday, November 22, 2024

T20 World Cup : టీమ్ ఇండియా జెర్సీ రూ. ఆరు వేలే..

20 వరల్డ్ కప్ కు సమయం ఆసన్నమైంది. మరో మూడు వారాల్లో ఈ పొట్టి సమరం ప్రారంభం కానుంది. వెస్టిండీస్, అమెరికా జట్లు సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్నాయి. ఇప్పటికే వరల్డ్ కప్ జట్లన్నీ ప్రకటించేశారు. ప్రస్తుతం ఈ మెగా టోర్నీ కోసం ఆయా దేశాలు తమ కొత్త జెర్సీలను రివీల్ చేస్తున్నాయి.

ఇందులో భాగంగా టీమిండియా జెర్సీని ఆవిష్కరించారు. టీమ్ స్పాన్సర్ అడిడాస్ ఇండియా.. కొత్త జెర్సీని ఆవిష్కరించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, జడేజా, కుల్దీప్ యాదవ్‌లు చూస్తుండగా హెలిక్యాప్టర్ ఎంట్రీతో జెర్సీని విడుదల చేశారు. అయితే, ఈసారి వరల్డ్ కప్ జెర్సీకి కాస్త కాషాయ రంగు అంటించారు.

- Advertisement -

ప్రస్తుతం టీమిండియా జెర్సీ ధర వైరల్ అవుతుంది. ఆన్ లైన్ లో ఈ జెర్సీ రూ. 5999 లకు సొంతం చేసుకోవచ్చు. ఈ ధర సామాన్యులను బయపెట్టినా..క్రికెట్ లవర్స్ ఈ జెర్సీ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. స్టోర్‌లలో, ఆన్‌లైన్‌లో adidas.co.inలో జెర్సీ అందుబాటులో ఉంది… అభిమానులు దానిని రూ.5999 లకు కొనుగోలు చేయవచ్చని అడిడాస్ తన ఎక్స్ లో తెలియజేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement