ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మెగాటోర్నీలో భారత్ తన తొలి మ్యాచులో దాయాది పాక్‌తో తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టోర్నీలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై గౌతం గంభీర్ స్పందించాడు. టీమ్ఇండియాతో పోలిస్తే పాకిస్థాన్ పైనే విపరీతమైన ఒత్తిడి ఉంటుందని గౌతమ్ గంభీర్ అంటున్నాడు. పాకిస్తాన్ తో పోలిస్తే కోహ్లీసేన ఎన్నో రెట్లు బలమైన జట్టని పేర్కొన్నాడు. పాకిస్థాన్ పైనా అంచనాలు విపరీతంగా ఉంటాయి. కానీ వారితో పోలిస్తే కోహ్లీసేన ఎన్నోరెట్లు మెరుగైన జట్టు. టీ20ల్లో ఎవర్ని ఎవరైనా ఓడించొచ్చు. ఎందుకంటే ఇది వ్యక్తిగత క్రీడ మాదిరిగానే ఉంటుంది. అందుకే ఏ జట్టునూ తక్కువ అంచనా వేయొద్దని పేర్కొన్నాడు. రషీద్‌ఖాన్ సారథ్యంలోని అఫ్గానిస్థాన్ జట్టు సంచలనాలు సృష్టించే అవకాశం ఉందని అంచనా వేశాడు.
ఇది కూడా చదవండి: ఫోటో వైరల్: పొలం పనులు చేస్తున్న రఘువీరా మనవరాలు