Monday, November 25, 2024

WTC Points Table | రెండో స్థానంలోకి టీమిండియా !

ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా వైజాగ్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా 106 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో హైదరాబాద్ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది.

అంతే కాకుండా, ఈ విజయంతో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 పాయింట్స్ టేబుల్‌లో టీమిండియా రెండో స్థానంలో నిలిచింది. హైదరాబాద్ టెస్ట్ పరాజయంతో రెండో స్థానం నుంచి ఐదో స్థానానికి పడిపోయిన భారత్.. వైజాగ్ టెస్ట్ గెలుపుతో ఐదు నుంచి రెండో స్థానానికి దూసుకెళ్లింది.

ప్రస్తుతం, డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో ఆ స్ట్రేలియా 55 విజయాల శాతంతో అగ్రస్థానంలో ఉండగా.. భారత్ 52.77 విన్ పర్సంటేజ్‌తో ఆసీస్ తర్వాత రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఆ తరువాత సౌతాఫ్రికా(50), న్యూజిలాండ్(50), బంగ్లాదేశ్(50) విన్నింగ్ పర్సంటేజీతో టాప్-5లో కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement