టీ20 ప్రపంచకప్ 2024లో వరుస విజయాలతో దూసుకెళుతున్న భారత్.. మరో కీలక పోరుకు సిద్ధమైంది. సూపర్-8లో భాగంగా తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌పై విజయం సాధించిన రోహిత్ సేన నేడు ఆంటిగ్వాలోని వీవీ రిచర్డ్స్ స్టేడియంలో జరిగే రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది.
ఈ మ్యాచ్‌లో విగెలిస్తే.. టీమిండియా సెమీఫైనల్ బెర్త్ దాదాపుగా ఖరారు అవుతోంది. ఈ క్రమంలోనే బంగ్లా మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని భారత్ భావిస్తోంది. విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న భారత్.. తుది జట్టులో రెండు మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి.
అఫ్గాన్‌తో మ్యాచ్‌లో విఫలమైన శివమ్ దూబే, రవీంద్ర జడేజాలను బంగ్లాదేశ్ మ్యాచ్‌లో పక్కనపెట్టే అవకాశం ఉంది. ఈ ఇద్దరి స్థానాల్లో యశస్వి జైస్వాల్, మొహ్మద్ సిరాజ్‌లు ఆడనున్నారు. మిడిలార్డర్లో దూబే వైఫల్యం భారత్‌కు సమస్యగా మారింది. దాంతో యశస్విని ఓపెనింగ్‌లో ఆడించి.. విరాట్ కోహ్లీని తనకు అలవాటైన మూడో స్థానంలో దింపాలని మేనేజ్మెంట్ చూస్తోందట.
ఇక వెస్టిండీస్ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయని ప్రచారం జరిగినా.. పేసర్లదే హవా నడుస్తోంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లలో పేసర్లే వికెట్స్ పడగొట్టారు. అందుకే జడేజా స్థానంలో హైదరాబాద్ ప్లేయర్ సిరాజ్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
భారత్ తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా.