Saturday, November 23, 2024

Breaking: ఆదిలోనే టీమిండియా త‌డ‌బాటు.. ఆదుకున్న కెప్టెన్ రోహిత్‌!

తాడో పేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా త‌డ‌బాటుకు గురయ్యింది. కీల‌క‌మైన తొలి రెండు వికెట్లు త్వ‌ర‌త్వ‌ర‌గా కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. అయినా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ త‌న‌దైన శైలిలో ఆడి మెరుగైన స్కోరు దిశ‌గా బోర్డును ప‌రుగులెత్తించాడు. జట్టు బాధ్యతను భుజాలకు ఎత్తుకున్న టీమిండియా సారధి రోహిత్ శర్మ (72) అదరగొట్టాడు. ఇండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేయగా.. శ్రీలంక టార్గెట్ 174 ఉంది.

కేఎల్ రాహుల్ (6), విరాట్ కోహ్లీ (0) అవుటైన తర్వాత సూర్యకుమార్ యాదవ్ (34) అండగా రోహిత్ రెచ్చిపోయి ఆడాడు.. ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డును ల‌గెత్తించాడు. ఇక‌.. 14 ఓవ‌ర్ ర‌న్నింగ్‌లో సూర్యకుమార్ కూడా అవుట‌య్యాడు. దీంతో 15వ ఓవర్​ నుంచి హార్దిక్ పాండ్యా, రిష‌బ్ పంత్ ఆట కొనసాగించారు.

అయితే.. పాండ్యా (17) సిక్స్​ బాదబోయి బౌండరీ వద్ద క్యాచ్​అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన దీపక్​ హుడా కూడా వెంటనే (0) అవుటయినట్టు ప్రకటించినా.. రీప్లేలో అది నోబాల్​గా తేలింది. దీంతో హుడా బతికిపోయాడు. ఫ్రీ హిట్​ దక్కింది. కాగా, 18వ ఓవర్​ మొదటి బంతికి దీపక్​ హుడా (3) వికెట్లను పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత మరో రెండు బంతులకే రిషబ్​ పంత్​ (17) పరుగులవద్ద క్యాచ్​ అవుటయ్యాడు. భువనేశ్వర్ (0)గా వెనుదిరగగా.. చివరికి రవిచంద్రన్​ అశ్విన్ 15,  అర్షదీప్​ సింగ్​ 1 కలిసి ఆట ముగించారు.

i
Advertisement

తాజా వార్తలు

Advertisement