వరల్డ్ కప్ ఫైనల్స్ కు భారత్ దూసుకు వెళ్లింది.. న్యూజిలాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో. 70 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 398 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్. 327 . పరుగులకు అలౌట్ అయింది. .ఈ మ్యాచ్ లో షమీ ఏడు. వికెట్లు తీసి కివీస్ పతనాన్ని శాసించాడు. కాగా భారత్. గత ప్రపంచ కప్ సెమీస్‌లో న్యూజిలాండ్ చేతుల్లో 18 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా, నాలుగేళ్ల తర్వాత ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్టైంది.. 397 పరుగుల లక్ష్యఛేదనలో న్యూజిలాండ్, 48.5 ఓవర్లలో 327 పరగులకి ఆలౌట్ అయ్యింది.
. వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన భారత్.. విరాట్ కోహ్లీ (113 బంతుల్లో 117, 9 ఫోర్లు, 2 సిక్సర్లు) రికార్డు సెంచరీకి తోడు శ్రేయస్ అయ్యర్ (70 బంతుల్లో 105, 4 ఫోర్లు, 8 సిక్సర్లు) వీరవిహారం చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 397 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ ఇద్దరితో పాటు ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్ శర్మ (29 బంతుల్లో 47, ఫోర్లు, సిక్సర్లు) ధాటిగా ఆడగా శుభ్‌మన్ గిల్ (66 బంతుల్లో 79 నాటౌట్, 8 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా రాణించడంతో కివీస్ ఎదుట భారత్ భారీ లక్ష్యాన్ని నిలిపింది.
398 పరుగుల భారీ లక్ష్యఛేదనలో న్యూజిలాండ్‌కి ఆరంభంలోనే షాక్ తగిలింది. 15 బంతుల్లో 3 ఫోర్లతో 13 పరుగులు చేసిన డివాన్ కాన్వేని అవుట్ చేసిన మహ్మద్ షమీ, ఆ తర్వాతి ఓవర్‌లో రచిన్ రవీంద్రను పెవిలియన్ చేర్చాడు. 39 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్..కెప్టెన్ కేన్ విలియంసన్, డార్ల్ మిచెల్ కలిసి మూడో వికెట్‌కి 181 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 73 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 69 పరుగులు చేసిన కేన్ విలియంసన్‌ని అవుట్ చేసిన మహ్మద్ షమీ, టీమిండియాకి బ్రేక్ అందించాడు
అదే ఓవర్‌లో టామ్ లాథమ్‌ని డకౌట్ చేశాడు మహ్మద్ షమీ. గ్లెన్ ఫిలిప్స్, డార్ల్ మిచెల్ కలిసి ఐదో వికెట్‌కి 75 పరుగులు జోడించారు. 33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులు చేసిన గ్లెన్ ఫిలిప్స్‌ని జస్ప్రిత్ బుమ్రా అవుట్ చేశాడు. మార్క్ చాప్‌మన్ 2 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.119 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్లతో 134 పరుగులు చేసిన డార్ల్ మిచెల్ కూడా మహ్మద్ షమీ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. న్యూజిలాండ్ టాపార్డర్‌లో ఐదుగురు బ్యాటర్లు మహ్మద్ షమీ బౌలింగ్‌లో అవుట్ కావడం విశేషం.. మిచెల్ సాంట్నర్ 9, టిమ్ సౌథీ 9 పరుగులు, లూకీ ఫర్గూసన్ 6 పరుగులు చేసి అవుట్ అయ్యారు. మహ్మద్ షమీ 7 వికెట్లు తీసి అదరగొట్టాడు.