Friday, November 22, 2024

భారత్-ఇంగ్లండ్ మధ్య నేడు మూడో టీ20

లెక్క సరిచేశారు.. ఇక ఆధిపత్య పోరు మొదలైంది. భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు టీ-20ల సిరీస్‌లో ఆధిపత్యం కోసం ఇరుజట్లు తహతహలాడుతున్నాయి. తొలి టీ20లో ఇంగ్లండ్ గెలవగా.. రెండో టీ20లో టీమిండియా లెక్క సరిచేసింది. మరి మూడో టీ-20లో గెలువరిదో మంగళవారం రాత్రి తేలుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ ఈరోజు రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. తొలి రెండు మ్యాచ్‌లలో టాస్ గెలిచిన జట్టే మ్యాచ్‌నూ బుట్టలో వేసుకుంది. మరి ఈ మ్యాచ్‌లో టాస్ ఎవరు గెలుస్తారో చూడాలి. టాస్ గెలిచిన కెప్టెన్ మరోసారి ఫీల్డింగ్ తీసుకోనున్నారు.

మూడో టీ20లో భారత్ తుది జట్టులో ఓ మార్పు జరిగే అవకాశముంది. ఫామ్‌లో లేని కేఎల్ రాహుల్ స్థానంలో రోహిత్ మళ్లీ జట్టులోకి రానున్నాడు. మరో ఓపెనర్‌గా ఇషాన్ కిషాన్‌ దిగనున్నాడు. రెండో టీ20లో కోహ్లీ ఫామ్‌లోకి రావడంతో టీమిండియా శిబిరంలో సంతోషం నిండింది. సూర్యకుమార్ యాదవ్‌కు రెండో మ్యాచ్‌లో బ్యాటింగ్ అవకాశం రాలేదు కాబట్టి మరో ఛాన్స్ దక్కనుంది. అటు ఇంగ్లండ్ కూడా ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌‌‌లో ఆధిక్యం కనపర్చాలని ఆత్మవిశ్వాసంతో ఉంది. ఆ జట్టులో పెద్దగా మార్పులు జరిగే అవకాశం కనిపించడం లేదు. ఒకవేళ జోర్డాన్ స్థానంలో మార్క్ వుడ్ బరిలోకి దిగొచ్చు. ఓపెనర్ జాసన్ రాయ్ ఫామ్‌లో ఉండటంతో ఇంగ్లీష్ జట్టు మరోసారి భారీ స్కోరు సాధించాలని ఆశిస్తోంది.

అటు తొలి రెండు మ్యాచ్‌లకు 50 శాతం ప్రేక్షకులను అనుమతించిన నిర్వాహకులు.. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చివరి మూడు టీ20లకు ప్రేక్షకులను అనుమతించేది లేదని స్పష్టం చేయడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement