Friday, January 10, 2025

AP | టీమిండియా క్రికెట‌ర్ నితీష్ కు స‌త్కారం…

దేశానికి కీర్తి ప్రతిష్టలు పెంచేలా కృషి చేయాలి
అభినందించిన ఏసీఏ కార్యదర్శి సానా సతీష్‌ బాబు


విశాఖపట్నం, జనవరి 10 : మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో సెంచరీతో ఉత్తమ ఆటతీరు కనబరిచి అందరి దృష్టినీ ఆకర్షించిన విశాఖపట్నంకు చెందిన యువ క్రికెటర్‌ నితీశ్‌ కుమార్‌రెడ్డిని ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) కార్యదర్శి సానా సతీష్‌బాబు ప్రత్యేకంగా అభినందించారు. ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని వైజాగ్‌కు వచ్చిన నితీశ్‌ కుమార్‌రెడ్డి విశాఖలోని వైఎస్సార్‌ ఏసీఏ – వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో శుక్రవారం ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) కార్యదర్శి సానా సతీష్‌బాబును మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఇంగ్లాండ్‌–ఇండియా టీ20 మ్యాచ్‌ సిరీస్, ఛాంపియన్స్‌ ట్రోఫీలకు కూడా సెలెక్ట్‌ అవుతారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తన ఆట తీరుతో భవిష్యత్తులో రెట్టింపు ఉత్సాహంతో ఉత్తమ ప్రతిభతో విజయాలు నమోదు చేసి ఇటు రాష్ట్రానికి, అటు దేశానికి, ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌కు కీర్తి ప్రతిష్టలు పెంచేలా కృషి చేయాలని, ఆ దిశగా ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ తరపున పూర్తి సహాయ సహకారాలు, తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -

ఇటీవల జరిగిన మెల్‌బోర్న్‌ టెస్ట్‌ మ్యాచ్‌లో నితీశ్‌కుమార్‌రెడ్డి అద్భుతమైన బ్యాటింగ్‌తో సెంచరీ చేసి భారత్‌ జట్టును ఆదుకున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఏసీఏ వైస్‌ ప్రెసిడెంట్‌ పి.వెంకట రామ ప్రశాంత్, కౌన్సిలర్‌ దంతు గౌర్‌ విష్ణు తేజ్, ఏసీఏ గేమ్‌ డెవలప్‌మెంట్‌ జనరల్‌ మేనేజర్‌ ఎం.ఎస్‌.కుమార్, అసిస్టెంట్ జనరల్‌ మేనేజర్‌ డి.శివకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement