Friday, November 22, 2024

వన్డే ర్యాంకుల్లో దూసుకెళ్లిన టీమిండియా

ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న టీమిండియా ఐసీసీ ర్యాంకుల్లోనూ దూసుకెళ్లింది. ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకుల్లో భారత్ (119) రెండో స్థానం సంపాదించింది. అటు వన్డే సిరీస్ కోల్పోయినా ఇంగ్లండ్ (121) టాప్ ర్యాంకును నిలబెట్టుకుంది. బంగ్లాదేశ్‌ను 3-0తో వైట్ వాష్ చేసినా కివీస్ మూడో స్థానానికే పరిమితమైంది. న్యూజిలాండ్ (118), ఆస్ట్రేలియా (111), దక్షిణాఫ్రికా (108) ఆ తర్వాతి ర్యాంకుల్లో ఉన్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్ తదుపరి స్థానాలలో కొనసాగుతున్నాయి.

కాగా మూడో వన్డేలో టీమిండియా 7 పరుగుల తేడాతో సూపర్‌ విక్టరీని సాధించి ప్రపంచ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో చివరిదాకా పోరాడి భారత శిబిరంలో గుబులు పుట్టించిన ఇంగ్లాండ్‌ యువ ఆల్‌రౌండర్‌ సామ్‌ కర్రన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు కైవసం చేసుకోగా, వరుస అర్ధసెంచరీలతో అలరించిన ఇంగ్లండ్‌ ఆటగాడు జానీ బెయిర్‌ స్టోకు ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు లభించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement