Friday, November 22, 2024

ఒకరి తర్వాత మరొకరు.. కరోనా బారినపడ్డ రోహిత్​ శర్మ

టీమిండియా సారథి రోహిత్‌ శర్మకు కరోనా వైరస్‌ సోకింది. అనారోగ్యంతో బాధపడుతున్న రోహిత్‌, వైద్య పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. రోహిత్‌ను ఐసొలేషన్‌కు తరలించిన వైద్యులు సోమవారంనాడు మరోమారు వైద్యపరీక్షలు చేయనున్నారు. ఈ మేరకు బీసీసీఐ ఆదివారంనాడు ట్విట్టర్‌లో ట్వీట్‌ చేసింది. ఈ నేపథ్యంలో జులై 1 నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభమయ్యే ఐదో టెస్టుకి రోహిత్‌ శర్మ అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది అనుమానంగా మారింది.

లీస్టర్‌షైర్‌తో జరుగుతున్న నాలుగు రోజుల వార్మప్‌ మ్యాచ్‌లో పాల్గొంటున్న రోహిత్‌ శర్మ, భారత క్రికెటర్లందరితో సన్నిహితంగా మెలిగాడు. దీంతో టీమిండియాలో కరోనా కలవరం మొదలైంది. ఐదో టెస్టు సమయానికి రోహిత్‌ శర్మ కోలుకోకపోతే వైస్‌ కెప్టెన్‌ జస్ప్రిత్‌ బుమ్రాకి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించే అవకాశముంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement