Sunday, November 24, 2024

T20 World Cup: అమెరికాలో టీమ్ ఇండియా…

రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు 2024 టీ20 ప్రపంచకప్ ఆడేందుకు అమెరికా చేరుకుంది. జూన్ 5న ఐర్లాండ్‌తో టీమ్ ఇండియా తొలి మ్యాచ్ ఆడనుంది. 2007 నుంచి ఇప్పటివరకు భారత్ ఈ టైటిల్‌ను ఒకసారి మాత్రమే గెలుచుకుంది. అప్పటి నుంచి జట్టు రిక్తహస్తాలతో తిరిగి వస్తోంది.

రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ రెండోసారి టీ20 ప్రపంచకప్ ఆడనుంది. గత ఎడిషన్‌లోనూ టీమిండియా ప్రయాణం సెమీఫైనల్‌ వరకు సాగింది. టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే భారత్‌కు సారథ్యం వహించారు. ఎంఎస్ ధోని 2007 నుంచి 2016 వరకు కెప్టెన్‌గా ఉన్నాడు. 2021లో విరాట్ కోహ్లి నాయకుడిగా ఉండగా, ఇప్పుడు రోహిత్ సారథ్యం వహిస్తున్నారు.

- Advertisement -

సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్‌లు 2024 టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టులో తొలిసారిగా ఎంపికయ్యారు. యుజ్వేంద్ర చాహల్ ఇంతకుముందు ఎంపికైనప్పటికీ, అతను ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. 2007 నుంచి 2024 వరకు భారత టీ20 ప్రపంచకప్ జట్టును పరిశీలిస్తే, ఇప్పటివరకు మొత్తం 58 మంది ఆటగాళ్లను ఎంపిక‌య్యారు. వీరిలో ఇప్పటివరకు ఏ టీ20 ప్రపంచకప్‌ను మిస్ చేసుకోని ఏకైక భారతీయుడు రోహిత్. అతను 2007 నుంచి నిరంతరం ఆడుతున్నాడు. 2012 నుంచి టీ20 ప్రపంచకప్‌లో కోహ్లి నిరంతరం టీమ్ ఇండియాలో భాగమయ్యాడు. రవీంద్ర జడేజా ఆరోసారి ఈ టోర్నీ ఆడబోతున్నాడు. హార్దిక్ నాలుగోసారి, పంత్-సూర్య మూడోసారి టీ20 ప్రపంచకప్ ఆడనున్నారు.
టి 20 ప్రపంచకప్ 2022తో పోల్చినట్లయితే, ఈసారి జస్ప్రీత్ బుమ్రా, జడేజా తిరిగి భారత జట్టులోకి వచ్చారు. గాయం కారణంగా వీరిద్దరూ గత ఎడిషన్‌లో ఆడలేకపోయారు. బుమ్రా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ రెండోసారి టీ20 ప్రపంచకప్ ఆడనున్నారు. మిగిలిన ఆటగాళ్లలో రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ మూడోసారి, హార్దిక్ పాండ్యా నాలుగోసారి టీ20 ప్రపంచకప్ ఆడనున్నారు.

భారత టీ20 ప్రపంచకప్ 2024 జట్టు..

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, కుల్‌దీప్ యాదాద్రి చావల్, మహ్మద్ సిరాజ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement