టీ20 ప్రపంచ కప్‌లో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. దశాబ్ద కాలంగా నెలకొన్న ట్రోఫీ కరువుకు తెరదించుతూ సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠ ఫైనల్ మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో ఓడించి… 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచ కప్‌ను భారత్ కైవసం చేసుకుంది. టోర్నమెంట్‌లో అజేయంగా నిలిచి టైటిల్ కైవసం చేసుకున్న జట్టుగా టీమిండియా రికార్డు క్రియేట్ చేసింది.
భారత్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో సౌతాఫ్రికా లక్ష్య ఛేదనలో విఫలమైంది. హెన్రిచ్ క్లాసెన్ (52) మెరుపు ఇన్నింగ్స్‌తో భయపెట్టినా…. బుమ్రా, హార్దిక్ పాండ్యా మ్యాచ్‌ను మలుపు తిప్పారు. చివరి ఓవర్లో పాండ్యా రెండు వికెట్లు తీసి భారత్‌కు 7 పరుగుల విజయాన్ని అందించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 176 పరుగులు బాదింది. విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో రాణించడంతో సౌతాఫ్రికా ముందు టీమిండియా 177 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అక్షర్ పటేల్ (47) మెప్పించాడు… ఇక శివం దుబే (27)తో పర్వాలేదనిపించాడు.