Wednesday, November 20, 2024

T20 World Cup | అగ్ర‌రాజ్యానికి ప‌య‌న‌మౌతున్న టీమిండియా..

మరో వారం రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభంకానుంది. ఈ మహా సమరానికి అమెరికా-వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. తృటిలో వన్డే ప్రపంచకప్‌ను చేజార్చుకున్న భారత్… టీ20 ప్రపంచకప్‌పై కన్నేసింది. ఎట్టిపరిస్థితుల్లో కప్‌ను సాధించి విశ్వవిజేతగా నిలవాలని టీమిండియా కసితో ఉంది. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులకు అలవాటు పడటానికి అమెరికాలోని న్యూయార్క్‌కు ఇవాళ భారత ఆటగాళ్లు పయనమవుతున్నారు.

అయితే ఎంపికైన ఆటగాళ్లందరూ ఒకేసారి వెళ్లకుండా…. రెండు బ్యాచ్‌లుగా వెళ్తున్నారు. ముంబయి విమానాశ్రయం నుంచి ఐదుగురు ఆటగాళ్లు మినహా అందరూ కలిసి బయలుదేరుతారు. తొలి బ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ తదితరులు ఈరోజు విమానం ఎక్కనున్నారు.

రెండో బ్యాచ్‌లో ఉన్న యశస్వీ జైస్వాల్, యుజువేంద్ర చాహల్, సంజు శాంసన్, అవేవ్ ఖాన్, రింకూ సింగ్ ఐపీఎల్ ఫైనల్ ముగిసిన తర్వాత బయలుదేరుతారు. అయితే హార్దిక్ పాండ్య ఏ బ్యాచ్‌తో కలిసి యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లట్లేదు. హార్దిక్ ఒంటరిగా అమెరికా వెళ్లనున్నాడు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న హార్దిక్ అక్కడ నుంచి నేరుగా యూఎస్‌ఏకు పయనమవుతాడు. కోచింగ్ స్టాఫ్ మొదటి బ్యాచ్‌తోనే వెళ్లనుంది.

భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.

రిజర్వ్ ప్లేయర్లు: శుభ్‍మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement