టీ20 ప్రపంచ కప్ అక్టోబర్ 22 నుంచి ఆస్ట్రేలియాలో ప్రారంభం కానుంది. అంతకంటే ముందు నిర్వహించే వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను గురువారంనాడు ఐసీసీ విడుదల చేసింది. ఈ వార్మప్ మ్యాచ్‌లు అక్టోబర్ 10 నుంచి 19 వరకు జరుగనున్నాయి. అక్టోబర్ 17న బ్రిస్బేన్ వేదికగా ఆతిథ్య మరియు డిఫెండింగ్ చాంపియన్స్ ఆస్ట్రేలియాతో భారత జట్టు తలపడనుంది. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 9.30గ.లకు మొదలవుతుంది. అక్టోబర్ 19న బ్రిస్బేన్ వేదికగా న్యూజిలాండ్‌తో రోహిత్ సేన పోటీపడనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2గం.లకు ప్రారంభమవుతుంది. వార్మప్ మ్యాచులను కూడా స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు. టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనే మొత్తం 16 జట్లు వార్మప్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. మొదటి రౌండ్‌లో వెస్టిండీస్, శ్రీలంక, ఐర్లాండ్, నమీబియా, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, యూఏఈ, జింబాబ్వే జట్లు తలపడున్నాయి. ఈ జట్లన్నీ అక్టోబర్ 10 నుంచి 13 వరకు వార్మప్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ మెల్‌బోర్న్, ఓవల్ మైదానాల్లో జరుగుతాయి. ఆ తర్వాత నేరుగా సూపర్-12 రౌండ్‌లో తలపడే జట్లు, వారి వార్మప్ మ్యాచ్‌లు అక్టోబర్ 17, 19 తేదీల్లో జరుగుతాయి.
వార్మప్ మ్యాచ్ షెడ్యూల్
అక్టోబర్ 10న వెస్టిండీస్- యూఏఈ, స్కాట్లాండ్- నెదర్లాండ్స్, శ్రీలంక- జింబాబ్వే జట్లు తలపడనుండగా, అక్టోబర్ 11న నమీబియా- ఐర్లాండ్, అక్టోబర్ 12న వెస్టిండీస్ – నెదర్లాండ్స్, అక్టోబర్ 13న జింబాబ్వే – నమీబియా, శ్రీలంక – ఐర్లాండ్, స్కాట్లాండ్- యూఏఈ పోటీపడనున్నాయి. అక్టోబర్ 17న భారత్- ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ -సౌతాఫ్రికా, ఇంగ్లండ్ – పాకిస్తాన్, అఫ్గనిస్తాన్ – బంగ్లాదేశ్ జట్లు, అక్టోబర్ 19న అఫ్గనిస్తాన్ – పాకిస్తాన్, బంగ్లాదేశ్ – సౌతాఫ్రికా, భారత్ – న్యూజిలాండ్ తలపడనున్నాయి. అనంతరం ప్రపంచ కప్ టోర్నీ ప్రారంభం కానుంది.