టీ20 ప్రపంచకప్ ట్రోఫీ టోర్నీకి వందరోజుల కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇదే సందర్భంలో టీ20 వరల్డ్ కప్ ప్రోమోను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసింది. విరాట్ కోహ్లీకి బదులుగా భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ని లీడ్‌గా చూపిస్తూ టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ప్రోమోని అంతర్జాతీయ క్రికెట్ మండలి విడుదల చేసింది. సిడ్నీ నగరం నడిఒడ్డున సంద్రంలో నుంచి రిషబ్ పంత్ ”బిగ్ స్టార్”గా బయటికి వస్తున్నట్టు ప్రోమోను వదిలింది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
విరాట్ కోహ్లీ సెంచరీలు చేయలేకపోతున్నా, పరుగులు రాకపోయినా సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. విదేశాల్లో కూడా విరాట్ కోహ్లీకి బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. ఐసీసీ వరల్డ్ కప్ ప్రోమోల్లోనూ విరాట్ కోహ్లీయే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచేవాడు. 2019 వన్డే వరల్డ్ కప్‌తోపాటు 2021 టీ20 వరల్డ్ కప్‌లోనూ కోహ్లీ చుట్టూనే ప్రోమోలు ఐసీసీ డిజైన్ చేసింది. అయితే ఇప్పుడు సీన్ మారింది. కోహ్లీ బ్యాటు నుంచి పరుగులు రాకపోగా మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ కోల్పోయాడు. ఈ నేపథ్యంలోనే విరాట్ కోహ్లీకి బదులుగా భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ని లీడ్‌గా చూపిస్తూ టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ప్రోమోని ఐసీసీ రూపొందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అక్టోబర్ 16న శ్రీలంక, నమీబియా మధ్య జరిగే మ్యాచ్‌తో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ మొదలుకానుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.