Sunday, November 24, 2024

T20 World Cup: ఇంగ్లండ్​కి ఘోర పరాభవం.. అటు వర్షం, ఇటు ఐర్లండ్ స్వింగ్​ బౌలింగ్​.. ​

ఐర్లాండ్ జట్టుతోపాటు ఆస్ట్రేలియాలోని మెల్​బోర్న్​ లో కురిసిన వర్షం ఇవ్వాల (బుధవారం) T20 ప్రపంచ కప్‌పై బిగ్​ ఎఫెక్ట్​ చూపాయి. క్రికెట్​ చరిత్రలో ఇంగ్లండ్​కి ఇదో షాక్​ వంటి ఓటమి అనే చెప్పొచ్చు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో 47 బంతుల్లో 62పరుగులతో రాణించిన ఐర్లాండ్‌ కెప్టెన్ ఆండీ బల్బిర్నీ .. ఇంగ్లండ్​కు158 పరుగుల టార్గెట్​ పెట్టాడు. కానీ, చాలా గొప్పగా చెప్పుకునే ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్.. ఐర్లాండ్ స్వింగ్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో అష్టకష్టాలు పడింది.

చివర్లో మోయిన్ అలీ (12 బంతుల్లో 24) మెరుగైన ఆటతీరుతో వర్షం ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 14.3 ఓవర్లలో 105/5కి చేరుకుంది. మరోసారి వర్షం రావడంతో డక్​వర్గ్​ లూయీస్​(DLS) స్కోరింగ్ పద్ధతిలో ఇంగ్లాండ్ ఐదు పరుగులు వెనుకబడి ఉంది. దీంతో ఐర్లాండ్​ గెలిచినట్టు ఎంపైర్లు ప్రకటించారు.

అనేక విఫల ప్రయత్నాల తర్వాత న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్‌ జట్లు ఒక్క బంతి కూడా వేయకుండానే ఒక పాయింట్‌తో సరిపెట్టుకోవలసి వచ్చింది. రెండు రౌండ్ల మ్యాచ్‌ల తర్వాత మూడు పాయింట్లతో – గ్రూప్ 1లో న్యూజిలాండ్‌ అగ్రస్థానంలో ఉంది. శ్రీలంక, ఇంగ్లండ్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా రెండు పాయింట్లు సాధించగా.. అఫ్ఘానిస్థాన్ ఒక పాయింట్‌తో చివరలో ఉంది.

మొదటి రౌండ్‌లోనే వెస్టిండీస్‌ను ఓడించి రెండుసార్లు చాంపియన్స్​ అయిన వారిని ఇంటికి పంపిన తర్వాత టోర్నమెంట్‌లో ఐర్లాండ్‌కు ఇది రెండో భారీ విజయంగా చెప్పుకోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్‌పై ఐదు వికెట్ల తేడాతో ఓపెనింగ్ విజయాన్ని ఆస్వాదించిన ఇంగ్లండ్..  టైటిల్ ఫేవరేట్‌లలో ఒకటిగా ఉండేది. కానీ, ఇవ్వాల జరిగిన ఆట తీరుతో వారికి ఐర్లండ్​ చేతిలో పరాభవం తప్పలేదు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement