Friday, November 22, 2024

నెదర్లాండ్స్ కి 180పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్

నేడు టీ20 ప్రపంచకప్ లో భారత్..నెదర్లాండ్స్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నెదర్లాండ్స్ ముందు టీమిండియా 180 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, రోహిత్‌ శర్మ రాణించడంతో భారత్‌ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. విరాట్ 44 బంతుల్లో 62, సూర్య 25 బంతుల్లో 51, రోహిత్ 39 బంతుల్లో 53 పరుగులు చేశారు. నెదర్లాండ్స్‌లో ఫ్రెడ్ క్లాసెన్, పాల్ వాన్ మెకెర్న్ తలో వికెట్ తీశారు.. కాగా, భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎలాంటి మార్పు లేదు. ఈరోజు నెదర్లాండ్స్‌పై నెగ్గితే టీమ్ ఇండియా గ్రూప్-2లో నంబర్-1గా మారుతుంది. కేఎల్ రాహుల్ పాకిస్తాన్‌పై 4 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. రెండో మ్యాచ్ అంటే నెదర్లాండ్స్‌పై కూడా మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. మూడో ఓవర్ నాలుగో బంతి మిడిల్ లెగ్‌లో పూర్తిగా పడింది. రాహుల్ దానిని ఫ్లిక్ చేయాలనుకున్నాడు. కానీ, అతను బంతిని మిస్ చేశాడు. అంపైర్ వెంటనే వేళ్లు పైకెత్తాడు. రాహుల్ 12 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేసి, పెవిలియన్ చేరాడు. రాహుల్ వికెట్ మికారెన్ దక్కించుకున్నాడు.పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (87) కీలక ఇన్నింగ్స్‌తో టీమిండియాకు విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే. ఇదే ఫాంతో నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 37 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసి, మరోసారి ఆకట్టుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement