టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా ఆటగాళ్లు యూఎస్ వెళ్లారు. భారత టీమ్ ఒక బ్యాచ్ రాత్రి ముంబై నుంచి ప్రత్యేక విమానంలో బయలు దేరింది. ఇప్పుడు కొందరు ఆటగాళ్లు మాత్రమే వెళ్లారు. మరొకరు రేపు లేదా ఎల్లుండి బయలుదేరే ఛాన్స్ ఉంది. ఆటగాళ్లతో కోచ్ రాహుల్ ద్రావిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ కూడా వెంట ఉన్నారు.
బయలుదేరిన వారిలో కెప్టెన్ రోహిత్ శర్మ, బూమ్రా, సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్, శివమ్ దూబె వంటి ఆటగాళ్లు విమానం ఎక్కారు. అంతకుముందు ఎయిర్‌పోర్టులో ఆటగాళ్లు గ్రూప్ ఫోటో దిగారు. దాన్ని బీసీసీఐ సోషల్‌మీడియాలో షేర్ చేసింది.
ప్రస్తుతం లండన్ ఉన్న హార్థిక్‌పటేల్ అక్కడి నుంచి అమెరికాకు వెళ్లనున్నారు. ఇదిలావుండగా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లితోపాటు ఐపీఎల్ క్వాలిఫ్లయర్-2లో ఆడిన రాజస్థాన్ ఆటగాడు సంజూశాంసన్, జైశ్వాల్, రింకూసింగ్ వెళ్లనున్నారు.
జూన్ రెండున ప్రారంభమయ్యే టీ 20 ప్రపంచకప్‌లో భారత్ తన తొలి మ్యాచ్ ఐర్లాండ్‌తో తలపడనుంది. అంతకుముందు అంటే ఒకటిన ప్రాక్టీసు మ్యాచ్‌లో ఆడనుంది. ఈ టోర్నీ అమెరికాతోపాటు వెస్టిండీస్ వేదికగా జరగనుంది. అమెరికా కంటే వెస్టిండీస్‌లో ఎక్కువ మ్యాచ్‌లు జరగనున్నాయి.