కరోనా సోకిన ఆటగాళ్లు ఇకపై ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదంటూ ఐసీసీ కీలక ప్రకటన చేసింది. దీంతో టీ 20
ప్రపంచకప్ 2022 ఐసిసి మంచి ఆఫర్ ఇచ్చిందని క్రికెట్ పరిశీలకులు అంటున్నారు. ఆస్ట్రేలియాలో టీ 20 ప్రపంచకప్ మహా సంగ్రామం ప్రారంభమైంది. ఈ టోర్నీలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చేసిన అతి పెద్ద మార్పులలో ఒకటి కరోనా ఇన్ఫెక్షన్కు సంబంధించిన మార్పు కూడా ఆస్ట్రేలియాలో కనిపించనుంది.
ఇంతకుముందు ఆటగాళ్లలో ఎవరికైనా కరోనా వస్తే అప్పటి నుంచి సదరు ప్లేయర్ నిర్దిష్ట రోజులతో పాటు ఒంటరిగా ఉండాల్సి వచ్చేది. అయితే తాజాగా ఇందులో ఐసీసీ కీలక మార్పు చేసింది. కరోనా సోకిన ఆటగాళ్లు కూడా ప్రపంచకప్లో ఆడేందుకు అనుమతిస్తారని ప్రకటించింది.