Friday, November 22, 2024

T20 Women’s WC | రేప‌టి నుంచి ధ‌నాధ‌న్ క్రికెట్..

కొద్ది నెలల క్రితమే రోహిత్‌ సేన టీ20 వరల్డ్‌కప్‌ ట్రోఫీ గెలుచుకోవడంతో భారత్‌లో అభిమానుల సంబరాలు మిన్నంటిన విషయం తెలిసిందే. ఇక ఆ తీపి జ్ఞాపకాలు ఇంకా మరవక ముందే మరో ధనాధన్‌ సమరానికి రంగం సిద్ధమైంది. రేపటి నుంచి దుబాయ్‌ వేదికగా మహిళల టీ20 ప్రపంచకప్‌ మొదలు కానుంది.

ఐసీసీ మెగా టోర్నీల్లో ఇప్పటిదాకా ఏ ఫార్మాట్లోనూ ప్రపంచకప్‌ సాధించలేక పోయిన భారత మహిళా జట్టు.. ఈసారి ఎలాగైన తమ కల నెరవేర్చుకోవాలని ఆతృతగా ఎదురుచూస్తోంది. గత ఎనిమిది సీజన్లుగా టీమిండియాకు అందని ద్రాక్షగా ఉన్న పొట్టి ప్రపంచకప్‌ ట్రోఫీని ఈసారి ఎలాగైన ఒడిసి పట్టేయాలని హర్మన్‌ సేన పట్టుదలతో ఉంది.

2020 వరల్డ్‌కప్‌లో మొదటిసారి ఫైనల్స్‌ వరకూ చేరిన భారత్‌ తృటిలో విశ్వవిజేత కిరీటాన్ని చేజార్చుకుంది. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. తర్వాత జరిగిన (2023) ప్రపంచకప్‌లోనూ భారత్‌ ఆసీస్‌ చేతిలో సెమీ స్‌లో ఓటమిపాలైంది. అయి తే ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉన్న భారత మహిళల జట్టు ఈసారి ఫేవరెట్‌గా మైదా నంలో అడుగుపెడు తోంది.

గత కొద్ది కాలంగా హర్మన్‌ సారథ్యంలోని టీమిండి యా పొట్టి క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. చిన్న, పెద్ద తేడాలేకండా ప్రతిజట్టుకు గట్టి సవాళ్లు విసురుతూ చిరస్మరణీయ విజయాలతో ఆకట్టు కుంటుంది. ఈ ఏడాది ఆరం భంలో సొంతగడ్డపై జరిగిన సిరీసుల్లో టీమిండియా పటిష్టమైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ జట్లపై విజ యాలు సాధించింది.

తర్వాత దక్షిణాఫ్రికాను కూడా చిత్తు చేసింది. ఇప్పుడు అదే జోష్‌తో దుబాయ్‌ గడ్డపై అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. ఈ జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.

- Advertisement -

గ్రూప్‌- ఎలో భారత్‌తో పాటు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలి యా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, శ్రీలంక జట్లు ఉన్నాయి. గ్రూప్‌-బిలో ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌, వెస్టిం డీస్‌, స్కాట్లాండ్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. లీగ్‌ దశముగిసిన తర్వాత ఈ గ్రూపుల్లో టాప్‌-2లో నిలిచే జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.

అయితే ఈసారి కూడా ఆస్ట్రేలియా హాట్‌ పేవరెట్‌గా బరిలోకి దిగనుంది. పొట్టి ప్రపంచకప్‌లో ఎదురులేని జట్టుగా నిలిచిన ఆస్ట్రేలియా 8 సీజన్‌లలో ఏకంగా 6 సార్లు వరల్డ్‌ ఛాంపియన్‌గా నిలిచి ఎవరికీ అందనంత ఎత్తులో నిలి చింది. తర్వాత ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ జట్లు చెరొక్క సారి విజేతలుగా నిలిచాయి.

ఇక ఈసారి ఆస్ట్రేలియా, భారత్‌ తో పాటు ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా జట్లు కూడా టైటిల్‌ ఫేవరెట్లుగా ఉన్నాయి. భారత్‌ తమ తొలి మ్యా చ్‌లో అక్టోబర్‌ 4న న్యూజిలాండ్‌తో తలపడనుంది. అనం తరం అక్టోబర్‌ 6న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాత్‌తో ఢీ కొననుంది.

ప్రపంచకప్‌ భారత జట్టు:

హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీ మా రొడ్రిగ్స్‌, రిచా ఘోష్‌, యాస్తిక భాటియా (ఫిట్‌నెస్‌ సాధిస్తే..) పూజా వస్త్రాకర్‌, అరుందతి రెడ్డి, రేణుక సింగ్‌ ఠాకూర్‌, హేమలత, ఆశ శోభన, రాధ యాదవ్‌, శ్రేయంకా పాటిల్‌ (ఫిట్‌నెస్‌ సాధిస్తే..), సంజన సజీవన్‌.

ట్రావెలింగ్‌ రిజర్వ్స్‌: ఉమా ఛెత్రీ, తనుజా, సైమా ఠాకూర్‌.
నాన్‌ ట్రావెలింగ్‌ రిజర్వ్స్‌: రాఘవి బిస్ట్‌, ప్రియా మిశ్ర.

Advertisement

తాజా వార్తలు

Advertisement