ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీకి రోహిత్ శర్మనే కెప్టెన్సీ చేసేలా చర్చలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో భారత మాజీ కెప్టెన్, దిగ్గజం సౌరవ్ గంగూలీ తన అభిప్రాయాలను వెల్లడించారు. రోహిత్ శర్మ, కోహ్లీ.. 2022 టీ20 ప్రపంచకప్ ఆడారు. ఆ తర్వాత భారత తరఫున మళ్లీ టీ20 ఆడలేదు. వన్డేలు, టెస్టులకే పరిమితమయ్యారు. 2024 టీ20 ప్రపంచకప్‍లో భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడడం చాలా ముఖ్యమని గంగూలీ చెప్పారు. బ్యాటింగ్‍తో పాటు వారిద్దరూ ఫీల్డింగ్ కూడా అద్భుతంగా చేస్తున్నారని, అందుకే వారు పొట్టి ప్రపంచకప్ ఆడాలని సూచించారు.
‘‘సుమారు 14 నెలలుగా ఏ T20Iలోనూ ఆడని వీరిద్దరూ.. జనవరి 11 నుండి మొహాలీలో ప్రారంభమయ్యే ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల T20I సిరీస్‌కు వారిని ఎంపిక చేస్తారో లేదో చూడాలి.’’ అని అన్నారు గంగూలీ.
కాగా, భారత జట్టు తదుపరి స్వదేశంలో అఫ్గానిస్థాన్‍తో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. జనవరి 11, 14, 17 తేదీల్లో ఈ మ్యాచ్‍లు జరగనున్నాయి. ఈ సిరీస్‍కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎంపికవుతారా అనేది ఆసక్తికరంగా మారింది. గాయపడిన హార్దిక్ పాండ్యా దూరం కానున్నాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా సందేహమే. ఈ సిరీస్‍తోనే టీ20ల్లోకి రోహిత్, కోహ్లీ రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి.