Saturday, November 23, 2024

రేప‌టి నుంచి టి-20 షురూ.. తలపడనున్న భారత్‌, దక్షిణాఫ్రికా

భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ 20 టోర్న మెంట్‌ గురువారం జరగనుంది. న్యూఢిల్లిdలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఈ ఫై-వ్‌ మ్యాచ్‌ సిరీస్‌ మొదలవనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన పూర్తయ్యాయి. 35 వేలమంది వీక్షించేందుకు అనువైన జైట్లీ స్టేడియంలో దాదాపు 94 శాతం మేర టికెట్‌ విక్రయాలు పూర్తయ్యాయి. 2019 తర్వాత దేశరాజధానిలో అంతర్జాతీయ క్రీడాపండుగ జరగ నుండడం ఇదే తొలిసారి. నాలుగు లేదా 500 టికెట్లు మాత్రమే ఇంకా ఉన్నాయని డీడీసీఏ సంయుక్త కార్యదర్శి రాజన్‌ మన్‌ చందా తెలిపారు. 27 వేల టికెట్లను విక్రయించనున్నామని తెలిపారు. సీనియర్‌ సిటిజన్లను ఈసారి ప్రత్యేక వెసులుబాటు కల్పించనున్నామన్నారు. వీరు గోల్ఫ్‌ కార్ట్‌ను ఉపయోగించుకుని స్టేడియంలోకి రావచ్చన్నారు.

మాస్కులు అనివార్యం..

పరిస్థిితి అదుపులోనే ఉన్నప్పటికీ కోవిడ్‌ 19 వ్యాప్తి ఆగ నందువల్ల మాస్కులు ధరించినవారినే లో పలికి అనుమతిస్తామని డీడీసీఏ అధికారులు తెలిపారు. ‘సిబ్బందికి ఎప్పటి కప్పుడు సిబ్బం దికి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నాం. కోవిడ్‌ నిబంధనలను విధిగా పాటించాలని ఫ్యాన్స్‌ని కోరుతున్నాం. భోజన విరామ సమయంలో తప్ప మిగతా సమయమంతా విధిగా మాస్కులు ధరించాల్సిందే’ అని మన్‌ చందా చెప్పారు. ఈ భారీ మ్యాచ్‌ నిర్వహణకు అన్నివిధాలుగా సన్నద్ధంగా ఉన్నామన్నారు. ఈ అంతర్జాతీయ మ్యాచ్‌ కోసం పిచ్‌ను సిద్దం గా ఉంచారు. కాగా ఈ స్టేడియంలో భారత జట్టు ఇప్పటికే రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. 2017లో భారత్‌- న్యూజిలాండ్‌ మధ్య జరిగిన హోరాహోరీ పోరులో భారత జట్టు 53 రన్ల తేడాతో విజయం సాధించింది. 2019లో జరిగిన సిరీస్‌లో ఏడు వికెట్ల తేడాతో భారత్‌ ఓటమిపాలైంది.

పాండ్యాపై ప్రశంసల జల్లు..

హార్దిక్‌ పాండ్యాపై భారత జట్టు హెడ్‌ కోచ్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ గ్రూపునకు ఇంకెవరి సారథ్యం తోనూ అవసరమే లేదన్నాడు. భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య పోరు సమయం ఆసన్నమైన సందర్భంగా మీడియాతో మాట్లాడాడు. ఆల్‌ రౌండర్‌ పాండ్యా నాయకత్వంలో అత్యుత్తమ ఫలితాలను ఎలా సాధించాలనే అంశపై దృష్టి సారించామన్నాడు. కాగా సీనియర్‌ లెవెల్లో పాండ్యాకు ఎటువంటి అనుభవం లేకపోయినప్పటికీ అనేక సందర్భాల్లో తన సత్తా చాటు కున్నాడు. మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో తీసుకునే నిర్ణయాల విషయంలో పరిణతి చాటాడు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement