పాకిస్థాన్ తో టీ-20 సిరీస్ లో వరుస విజయాలతో దూకుడు మీదున్న న్యూజిలాండ్ కు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ మరోసారి గాయపడ్డాడు. రెండో టీ20 మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో విలియమ్సన్ స్నాయువు నొప్పితో బాధపడ్డాడు. రిటైర్డ్ హర్ట్ గా మైదానం వీడిన విలియమ్సన్ ఆ తర్వాత మైదానంలోకి రాలేదు.
గాయం తీవ్రత చిన్నదే అయినప్పటికీ.. విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని కివీస్ క్రికెట్ బోర్డు తెలిపింది. దీంతో ఈ స్టార్ ఆటగాడు టీ20 సిరీస్‌లో మిగిలిన మూడు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. అతని స్థానంలో టిమ్ సీఫెర్ట్ జట్టులోకి రానున్నాడు. అయితే సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌కు ముందు విలియమ్సన్ ఫిట్‌గా మారతాడని ప్రధాన కోచ్ గ్యారీ స్టీడ్ తెలిపాడు.