టీమిండియా పెట్టిన భారీ టర్గెట్ని ఛేదించడంలో శ్రీలంక తడబాటుకు గురయ్యింది. ఒత్తిడితో త్వరత్వరగా వికెట్లు కోల్పోయి ఓటమి చెందింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఆవిష్క ఫెర్నాండో అవుట్ అయ్యాడు. అంతకు ముందు ఓపెనర్ ప్రథుమ్ నిస్సంకా (15) అర్షదీప్ బౌలింగ్‌లో రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ కుశాల్ మెండిస్ (23)ను అక్షర్ పటేలో బొల్తా కొట్టించాడు. 229 టార్గెట్‌తో బరిలోకి దిగిన లంకకు కుశాల్ మెండిస్, ప్రథుమ్ నిస్సంకా ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు వీళ్లిద్దరూ 44 పరుగులు జోడించారు. ఆ తర్వాత అవిష్క ఫెర్నాండో (1), ధనుంజయ డిసిల్వా (22), అసలంక (19), హసరంగ (9), కరుణరత్నే (0), మహేశ్ తీక్షణ (2), షనుక (23) పరుగులకే పెవిలియన్ చేరారు. మొత్తంగా 137 పరుగులకే లంక కుప్పకూలింది. భారత్‌కు విజయం చేకూరింది.
ఇందులో హార్దిక్ పాండ్యా 2, అర్షదీప్ సింగ్ 2, ఉమ్రాన్ మాలిక్ 2, చాహల్ 2 వికెట్లు తీసుకోగా.. అక్షర్ పటేల్ 1 వికెట్ పడగొట్టాడు. కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగడంతో 228 పరుగులు చేసింది. సూర్య 45 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. టీమిండియా బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ 46, రాహుల్ త్రిపాఠి 35 పరుగులతో రాణించారు. చివర్లో అక్షర్ పటేల్(21) విధ్యంసం సృష్టించాడు.