రాయ్ పూర్ – నాల్గో టీ 20 మ్యాచ్ లో భారత జట్టు అదరగొట్టింది. బౌలర్లు సమిష్టిగా రాణించడం తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ను 20 పరుగుల తేడాతో మట్టికరిపించింది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు మాత్రమే చేసింది.ఆఖరి ఓవర్లో 31 పరుగులు అవసరమవగా.. అవేశ్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టును గెలిపించాడు. ఆసీస్ కెప్టెన్ మాథ్యూ వేడ్(36 నాటౌట్) చివరిదాకా పోరాడినా ఫలితం లేకపోయింది
.భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు, దీపక్ చాహర్ రెండు, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్ తలా వికెట్ సాధించారుమూడో విజయంతో ఐదు టీ20ల సిరీస్ ను కైవసం చేసుకుంది. . .
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు కొట్టింది. ప్రధాన ఆటగాళ్లు చేతులెత్తేయడంతో రింకూ సింగ్(46 : 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. టాపార్డర్‌లో రుతురాజ్ గైక్వాడ్(32), యశస్వీ జైస్వాల్(37 : 28 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్) ఫర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో బెన్ డ్వార్‌షుయిస్ మూడు, బెహ్రెన్‌డార్ఫ్ రెండు వికెట్లు తీశారు