Thursday, November 21, 2024

Breaking: అమెరికాలో టీ20 మ్యాచ్‌.. 10 ఓవ‌ర్లు ముగిసే స‌రికి టీమిండియా స్కోర్ ఎంతంటే..

ఫ్లోరిడాలో వరుణుడు కరుణించడంతో టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ ఆల‌స్యంగా ప్రారంభమైంది. వర్షం రాక‌తో దాదాపు అరగంట ఆలస్యంగా టాస్ వేశారు. టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన భారత్ 10 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు న‌ష్ట‌పోయి 96 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (33), సూర్యకుమార్ యాదవ్ (24) ప‌రుగులు చేశారు. వారి త‌ర్వాత వ‌చ్చిన దీప‌క్ హుడా, రిష‌బ్ పంత్ ఆట కొన‌సాగిస్తున్నారు.

ఈ సిరీస్ లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో మొదటి మూడు మ్యాచ్ లకు వెస్టిండీస్ ఆతిథ్యం ఇచ్చింది. అయితే అమెరికాలోనూ క్రికెట్ కు ప్రజాదరణ కల్పించాలన్న ఐసీసీ ప్రణాళికల్లో భాగంగా సిరీస్ లో మిగిలిన రెండు వన్డేలను ఫ్లోరిడాలో నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement