టీ20 ప్రపంచకప్ గ్రూప్ 2 లో భాగంగా నేడు స్కాట్లాండ్ తో న్యూజిలాండ్ జట్టు తలపడనుంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే పాకిస్తాన్ తో ఓటమి తర్వాత టీమిండియాతో జరిగిన కీలక మ్యాచ్ లో ఘన విజయం సాధించిన కివీస్ జట్టు స్కాట్లాండ్ తో జరిగే మ్యాచ్ లోను విజయం సాధించి సెమీస్ కి చేరువకావాలనే పట్టుదలతో ఉంది.
ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ లలోను ఓటమిపాలైన స్కాట్లాండ్ టీ20 వరల్డ్ కప్ లో ఒక విజయం సాధించైనా బోణి కొట్టాలని చూస్తోంది. ఇక నామమాత్రంగా జరగనున్న ఈ మ్యాచ్ లో కివీస్ జట్టుకే గెలుపు అవకాశాలున్నాయని స్పోర్ట్స్ అనలిస్టులు అంటున్నారు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో భాగంగా దుబాయ్ స్టేడియంలో జరిగిన 6 మ్యాచ్ లకు గాను 6 మ్యాచ్ లలో రెండో బ్యాటింగ్ చేసిన జట్టే విజయం సాధించడం గమనించదగ్గ విషయం.