Saturday, June 29, 2024

T20 – ఉత్కంఠ పోరు లో విశ్వ విజేత ఇండియా

:పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్లో టీమిండియా సూప‌ర్ విక్ట‌రీ కొట్టింది. ఆఖ‌రి ఓవ‌ర్ వ‌రకూ ఉత్కంఠ రేపిన టైటిల్ పోరులో ద‌క్షిణాఫ్రికా )తొలి టైటిల్ ఆశ‌ల‌కు చెక్ పెట్టింది. ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టి 11 ఏండ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌దించుతూ స‌గ‌ర్వంగా ట్రోఫీని ముద్దాడింది. ఛేద‌న‌లో హెన్రిచ్ క్లాసెన్(52) సుడిగాలి ఇన్నింగ్స్‌తో భ‌య‌పెట్టినా హార్దిక్ పాండ్యా(3/20), బుమ్రా(2/18), లు మ్యాచ్‌ను మ‌లుపుతిప్పారు. ఆఖ‌రి ఓవ‌ర్లో రెండు వికెట్లు తీసిన పాండ్యా భార‌త్‌కు 7 వికెట్ల విజ‌యాన్ని అందించాడు. అంతే.. చోక‌ర్స్ ముద్ర ప‌డిన దక్షిణాఫ్రికా ఒత్తిడిని జ‌యించ‌లేక ట్రోఫీ చేజార్చుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement