టీమిండియాకు టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నాయా? అంటే అవుననే అంటున్నారు క్రికెట్అనలిస్టులు. నిన్న స్కాట్లాండ్పై గెలవడంతో పాటూ మంచి రన్ రేట్ కూడా సాధించిన భారత్.. అభిమానుల్లో సెమీస్ ఆశలను సజీవంగా నిలిపిందనే చెప్పవచ్చు. అఫ్గానిస్తాన్‌పై 210 పరుగుల భారీ స్కోరు చేసి, 66 పరుగులు తేడాతో విజయం సాధించిన ఇండియా.. ఇప్పుడు స్కాట్లాండ్ మీద విజయంతో రన్ రేట్ మరింత మెరుగు పరుచుకుంది. 8 పాయింట్లతో గ్రూప్ 2 పట్టికలో టాప్‌లో ఉన్న పాకిస్తాన్ కంటే కూడా భారత్ రన్ రేటే ఎక్కువ.
అయితే.. స్కాట్లాండ్ను 85 పరుగులకు కట్టడి చేయడంతోపాటూ ఏడు ఓవర్లలోపే లక్ష్యాన్ని అందుకున్న భారత్ 1.679 రన్ రేట్ సాధించింది. మొదటి రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో భారత్ తన సెమీస్ అవకాశాలు మెరుగు పరుచుకోవాలంటే మిగిలిన మ్యాచుల్లోనూ భారీ తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది. ఇప్పుడు వరుసగా స్కాట్లాండ్ మీద విజయంతో భారత్‌లో ఒక్కసారిగా ఉత్సాహం వచ్చింది.
స్కాట్లాండ్ చిన్న జట్టే అయినా.. ఈ మ్యాచ్ కీలకం కావడంతో భారత్ పక్కా లెక్కలతోనే రంగంలోకి దింగింది. టాస్ గెలవడంతోనే బౌలింగ్ ఎంచుకుని ప్రత్యర్థి జట్టును 85 పరుగులకు కట్టడి చేసింది. రన్ రేట్ మెరుగు పరుచుకోవాలంటే ఏ గేమ్ ప్లాన్‌తో ఆడాలన్న విషయాన్ని బీసీసీఐ బ్యాట్స్ మెన్ కు ముందే ట్వీట్ ద్వారా తెలియజేసింది.
విరాట్ జట్టు ఈ లక్ష్యాన్ని 8.5 ఓవర్లలో చేజ్ చేస్తే.. న్యూజిలాండ్ రన్ రేట్ దాటవచ్చని, 7.1 ఓవర్ లోపు చేజ్ చేస్తే అఫ్గానిస్తాన్ రన్ రేటును కూడా దాటేయచ్చని చెప్పింది. బీసీసీఐ లెక్కలు వేసినట్లే ఏడో ఓవర్లోనే విజయ లక్ష్యాన్ని అందుకున్న టీమిండియా సెమీస్ చేరుకునే అవకాశాలను సజీవంగా నిలిపింది.
ఇక ఇప్పుడు భారత్ మాత్రమే కాదు.. క్రికెట్ ప్రపంచం కళ్లన్నీ రేపు జరగబోయే అఫ్గానిస్తాన్- న్యూజిలాండ్ మ్యాచ్ మీదే ఉన్నాయి. మొన్నటి వరకూ భారత పేలవ ప్రదర్శనకు ఆగ్రహించిన క్రికెట్ అభిమానులు ఇప్పుడు అఫ్గానిస్తాన్ విజయం కోసం ప్రార్థిస్తున్నారు.
రెండు విజయాలతో 4 పాయింట్లు సాధించిన భారత్ 1.169 రన్ రేట్ సాధించింది. ఇక భారత్ ఒక్క నమీబియాతో ఆడాల్సి ఉంది. ఆఫ్గానిస్తాన్‌పై విజయం తర్వాత మైనస్ నుంచి 1.069కి చేరిన భారత రన్ రేట్ ఇప్పుడు 1.619కు చేరింది. భారత్ సెమీస్‌కు వెళ్లాలంటే న్యూజిలాండ్ అఫ్గానిస్తాన్ చేతిలో ఓడిపోవాలి. అదే జరిగితే రన్ రేట్ ద్వారా సెమీస్‌కు చేరడానికి భారత్‌కు మంచి అవకాశం ఉంటుంది.
The equation for semi-final place is simple:
— Rajneesh Gupta (@rgcricket) November 5, 2021
If NZ beat Afg, India are out.
If Afg score 150 & beat NZ by….
1 run (India need to just beat Namibia)
10 runs (India need to win by ~3 runs)
20 runs (by ~12 runs)
30 runs (by ~22 runs)
50 runs (by ~40 runs)#T20WorldCup21 #INDvsSCO