మహిళల టీ20 ఆసియా కప్ 2024 షెడ్యూల్ వచ్చేసింది. శ్రీలంకలో జరిగే ఈ టోర్నీ షెడ్యూల్‌ను ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) మంగళవారం ప్రకటించింది. జులై 19న ప్రారంభం కానున్నఈ టోర్నీలో మొదటి రోజు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి.
ప్రారంభ మ్యాచ్‌లో యూఏఈతో నేపాల్ తలపడనుంది. అదే రోజున హైవోల్టేజ్ మ్యాచ్ భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది.
జులై 28 వరకు సాగే ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు బరిలోకి దిగనున్నాయి. ఈ జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. ఆయా గ్రూప్‌ల్లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, యూఏఈ, నేపాల్ ఉన్నాయి. అలాగే గ్రూప్-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, థాయ్‌లాండ్, మలేసియా ఉన్నాయి.
డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. కాగా, అన్ని మ్యాచ్‌లు శ్రీలంకలోని దంబుల్లాలో జరగనున్నాయి. గ్రూప్ దశలో భారత్.. పాకిస్థాన్‌తో జులై 19న, యూఏఈతో జులై 21న, నేపాల్‌తో జూలై 23న తలపడనుంది. జులై 26న సెమీఫైనల్ 1, 2 జరగనున్నాయి. ఇక జులైన 28న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్ మ్యాచ్‌లన్నీ రాత్రి 7 గంటలకు ప్రారంభంకానున్నాయి.
ఆసియా కప్ షెడ్యూల్ (వేదిక- దంబుల్లా)
జులై 19: యూఏఈ vs నేపాల్
జులై 19: భారత్ vs పాకిస్థాన్
జులై 20: మలేషియా vs థాయిలాండ్
జులై 20: శ్రీలంక vs బంగ్లాదేశ్
జులై 21: భారత్ vs యూఏఈ
జులై 21: పాకిస్థాన్ vs నేపాల్
జులై 22: శ్రీలంక vs మలేషియా
జులై 22: బంగ్లాదేశ్ vs థాయిలాండ్
జులై 23: పాకిస్థాన్ vs యూఏఈ
జులై 23: భారత్ vs నేపాల్
జులై 24: బంగ్లాదేశ్ vs మలేషియా
జులై 24: శ్రీలంక vs థాయిలాండ్
జులై 26: సెమీ ఫైనల్ 1
జులై 26: సెమీ ఫైనల్ 2
జులై 28: ఫైనల్