క్రికెట్ అభిమానులకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ శుభవార్త చెప్పింది. టీ20 ప్రపంచకప్‌కు మరో ఐదు నెలలు సమయం ఉండగానే ఈ టోర్నీకి సంబంధించిన మ్యాచ్ టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. జూన్ 1 నుంచి 29 వరకు జరగనున్న ఈ టోర్నీకి వెస్టిండీస్, యూఎస్ లు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
ఈ క్రమంలో మ్యాచ్ టికెట్లకు అధిక డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఐసీసీ పబ్లిక్ బ్యాలట్ విధానంలో టికెట్లను అమ్మకానికి ఉంచింది. ఆంటిగ్వా కాలమానం ప్రకారం ఫిబ్రవరి 7 రాత్రి 11.59 గంటలకు విండో ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొ మ్యాచు కోసం ఆరు టికెట్లు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
ఈ విండో ద్వారా మొత్తం 6.60లక్షల టికెట్లను అమ్మకానికి ఉంచారు. పబ్లిక్ బ్యాలట్ ద్వారా అమ్ముడుపోగా మిగిలిన టికెట్లను.. tickets.t20worldcup.com వైబ్‌సైట్‌లో ఫిబ్రవరి 22 నుంచి అందుబాటులోకి రానున్నాయి. బ్యాలెట్ ద్వారా టికెట్లు పొందిన వాళ్లకు మెయిల్ ద్వారా టికెట్ల వివరాలను అందించనున్నారు. కాగా, ఈ టికెట్ల ధరలు ధరలు రూ.497 నుంచి రూ.2070 వరకు ఉన్నాయి.