Friday, November 22, 2024

T 20 World Cup – చివ‌రి వ‌ర‌కు పోరాడిన స్కాట్లాండ్ – ఉత్కంఠ పోరులో విజ‌యం ఆస్ట్రేలియాదే

టీ20 ప్రపంచకప్ 2024లో ఆస్ట్రేలియా జోరు కొనసాగుతోంది. గ్రూప్-బీలో భాగంగా స్కాట్లాండ్‌తో ఆదివారం ఉదయం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో రెండు బంతులు మిగిలి ఉండగానే ఆసీస్ విజయాన్నందుకుంది.

ఈ గెలుపుతో గ్రూప్-బీ టాపర్‌గా ఆస్ట్రేలియా సూపర్-8 చేరగా.. స్కాట్లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. దాంతో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ఊపిరి పీల్చుకుంది. ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్ విజయం సాధించి ఉంటే ఇంగ్లండ్ ఇంటిదారి పట్టేది. ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్‌లు గెలవడంతో పాటు ఒక్క రద్దవ్వడంతో 5 పాయింట్లతో సమంగా నిలిచాయి. మెరుగైన రన్ రేట్ ఉన్నఇంగ్లండ్ టోర్నీలో ముందడుగు వేసింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. బ్రెండన్ మెక్‌కల్లమ్(34 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 60) హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ రిచీ బెర్రింగ్టన్(42 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
ఆస్ట్రేలియా బౌలర్లలో గ్లేన్ మ్యాక్స్‌వెల్(2/44) రెండు వికెట్లు తీయగా.. అష్టన్ అగర్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసి గెలుపొందింది. ట్రావిస్ హెడ్(49 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 68), మార్కస్ స్టోయినీస్(29 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 59) హాఫ్ సెంచరీలతో రాణించారు.

ఆఖరి ఓవర్‌లో ఆసీస్ విజయానికి 5 పరుగులు అవసరమవ్వగా.. స్కాట్లాండ్ బౌలర్ వీల్ తొలి రెండు బంతుల్లో రెండు పరుగులే ఇచ్చాడు. మూడో బంతికి టీమ్ డేవిడ్ ఇచ్చిన క్యాచ్‌ను ఫీల్డర్ నేలపాలు చేశాడు. దాంతో స్కోర్లు సమం కాగా.. మరుసటి బంతిని టీమ్ డేవిడ్ సిక్సర్ బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement