Thursday, November 7, 2024

T 20 – హై ఓల్టేజ్ మ్యాచ్ కు స‌ర్వం సిద్దం – న్యూయార్క్ లో భార‌త్ – పాక్ ఢీ

ఈ మ్యాచ్ లో దాయాది జ‌ట్టు ఓడితే ఇంటికే

అంద‌రి చూపులు ఈ మ్యాచ్ పైనే.

ద‌డ పుట్టిస్తున్న పిచ్

తొలి అయిదు ఓవ‌ర్లే పెద్ద గండం

- Advertisement -

.టీ20 ప్రపంచ కప్ హై-వోల్టేజ్ యుద్ధానికి వేదిక సిద్ధమైంది. ఆదివారం రాత్రి 8:గంటలకు న్యూయార్క్‌లోని నసావు కౌంటీ స్టేడియం వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో 19వ మ్యాచ్‌లో సంప్రదాయ ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్ కోసం టీమ్ ఇండియా బలమైన ప్లేయింగ్ ఎలెవన్‌తో బరిలోకి దిగనుంది.

పసికూన అమెరికా చేతిలో అనూహ్య పరాజయాన్ని ఎదుర్కొన్న పాకిస్థాన్.. మెగా టోర్నీలో కొనసాగాలంటే ఈ బిగ్ మ్యాచ్‌లో గెలవడం చాలా ముఖ్యం. టీ20 క్రికెట్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ జట్లు మొత్తం 12 సార్లు తలపడ్డాయి. ఈ సమయంలో పాకిస్థాన్ జట్టు కేవలం 3 సార్లు మాత్రమే గెలిచింది. టీమిండియా 9 సార్లు గెలిచింది. ఈ క్రమంలో ఈసారి కూడా టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది.

జ‌ట్టు కూర్పు ఇదే..

ముఖ్యంగా ఈసారి కూడా నలుగురు ఆల్ రౌండర్లతో భారత జట్టు బరిలోకి దిగే అవకాశం ఉంది. ఎందుకంటే, ఇదే మైదానంలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఆల్‌రౌండర్లు.. ఈ కంపోజిషన్‌తో భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఏర్పాటు చేస్తుంది.

ఏడుగురు బౌలర్లు:

టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో నలుగురు ఆల్‌రౌండర్లు ఉన్నందున, ఏడుగురు బౌలర్లను కెప్టెన్ రోహిత్ శర్మ ఎంపిక చేసే అవకాశం ఉంది. అంటే జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ పేసర్లుగా బరిలోకి దిగడం ఖాయం.హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలను టీమిండియాలో అదనపు పేసర్లుగా ఉపయోగించుకోవచ్చు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ కూడా స్పిన్నర్లుగా ఎంపికయ్యారు. తద్వారా ఏడుగురు బౌలర్లతో టీమ్ ఇండియా వ్యూహం రచించే అవకాశం ఉంది

ఓపెనర్స్ ఎవరు?

ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. అందుకే, పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లోనూ ఇదే జోడి చెలరేగనుంది. రిషబ్ పంత్ మూడో స్థానంలో ఆడటం ఖాయం. సూర్యకుమార్ యాదవ్ నాలుగో నంబర్‌లో బ్యాటింగ్ చేయగా, శివమ్ దూబే ఐదో నంబర్‌లో . అలాగే హార్దిక్ పాండ్యా ఆరో స్థానంలో ఆడితే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఫినిషర్ పాత్రల్లో కనిపిస్తారు.

పాకిస్థాన్ …..

ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా పాకిస్థాన్ సూపర్-8కు అర్హత కు మార్గం సుగ‌మం అవుతుంది. ఓడితే మాత్రం అమెరికా ఆడే మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే భారత్‌ను ఓడించడమే లక్ష్యంగా పాకిస్థాన్ సన్నదమవుతోంది. తొలి మ్యాచ్‌లో చేసిన తప్పిదాలను సరిచేసుకోవడంపై ఫోకస్ పెట్టింది

బాహుబ‌లిపై వేటు..

ఈ క్రమంలోనే తుది జట్టులో మార్పులు చేసేందుకు రెడీ అయ్యింది. బలహీనంగా ఉన్న బ్యాటింగ్‌ లైనప్‌ను పటిష్టం చేయాలనుకుంటోంది. అమెరికాతో తొలి పోరులో బాబర్ ఆజామ్, రిజ్వాన్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. అయితే ఈ ఇద్దరూ పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలోనే దూకుడుగా ఆడే ఓపెనర్‌ను బరిలోకి దించాలని పాకిస్థాన్ భావిస్తోంది.

సయిమ్ ఆయుబ్‌ ఫిట్‌గా ఉంటే అతన్ని ఓపెనర్‌గా ఆడించాలనుకుంటోంది. ఆయుబ్ జట్టులోకి వస్తే ఆజామ్ ఖాన్‌పై వేటు పడనుంది. అప్పుడు మహమ్మద్ రిజ్వాన్ వికెట్ కీపింగ్ చేస్తాడు. అమెరికాతో మ్యాచ్‌లో ఆజామ్ ఖాన్ గోల్డెన్ డక్ అయ్యాడు. అతని వైఫల్యం పాకిస్థాన్ పరాజయానికి కారణమైంది. ఈ క్రమంలోనే ఆజామ్‌ ఖాన్‌ను పక్కనపెట్టాలని పాకిస్థాన్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

చిచ్చాకు మరో ఛాన్స్

మరో వెటరన్ ప్లేయర్ ఇఫ్తికర్ అహ్మద్ కూడా తొలి మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే అతనికి స్పిన్ బౌలింగ్ చేసే సామర్థ్యం ఉండటం కలిసొచ్చే అంశం. న్యూయార్క్ పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో తుది జట్టులో కొనసాగే అవకాశం ఉంది. గాయంతో ఇబ్బంది పడుతున్న ఇమాద్ వసీం అందుబాటులోకి వస్తే అతను తుది జట్టులోకి వస్తాడు. అప్పుడు పాకిస్థాన్ ముగ్గురు పేసర్లతోనే బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఇమాద్ వసీం బరిలోకి దిగితే తొలి మ్యాచ్‌లో విఫలమైన హ్యారీస్ రౌఫ్‌పై వేటు పడనుంది.

.

పాకిస్థాన్ తుది జట్టు(అంచనా): మహమ్మద్ రిజ్వాన్, సయిమ్ ఆయుబ్, బాబర్ ఆజామ్, ఫకార్ జమాన్, ఉస్మాన్ ఖవాజా, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం, షాహిన్ అఫ్రిది, నసీమ్ షా, మహమ్మద్ అమీర్

Advertisement

తాజా వార్తలు

Advertisement