స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఎఫ్‌ఐ) 23 మంది సభ్యులతో కూడిన అక్వాటిక్ డిసిప్లిన్స్ (స్విమ్మింగ్- డైవింగ్)తో జట్టును శనివారంనాడు అధికారికంగా ప్రకటించింది. 9 మందితో స్విమ్మింగ్ ఉమెన్ టీమ్‌ను ఎంపిక చేసినట్లు ఎస్‌ఎఫ్‌ఐ సెక్రటరీ జనరల్ మోనాల్ చోక్సీ తెలిపారు. స్విమ్మర్లంతా 14-19 ఏళ్ల వయస్సు వారేనని, ఇటీవల టోర్నమెంట్లలో అద్భుతంగా రాణించిన అథ్లెట్లనే ఎంపిక చేశామన్నారు. 12 మందితో మెన్స్ టీమ్‌ను ఎంపిక చేశామన్నారు. ఇక డైవింగ్ ఈవెంట్స్‌లో సిద్ధార్థ్ బజ్‌రంగ్ ప్రదేశి, హేమన్ లండన్ సింగ్‌లు పాల్గొంటారని తెలిపారు. అలాగే 13 మంది సభ్యులతో వాటర్ పోలో స్క్వాడ్‌ను ఎంపిక చేసి భారత ఒలింపిక సంఘం (ఐవోఏ)కు ప్రతిపాదన పంపామని వివరించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement