ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సోషల్ మీడియాలో ఎమోషనల్ అయ్యాడు. అతను తన ఇన్‌స్టా స్టోరీలో హార్ట్ బ్రేక్ సింబల్‌ను షేర్ చేశాడు. దీంతో ముంబై ఇండియన్స్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఫిట్నెస్ టెస్ట్ క్లియర్ చేయకపోవడంతోనే సూర్యకుమార్ యాదవ్ హార్ట్ బ్రేక్ లవ్ సింబల్‌ను ఇన్‌స్టా స్టోరీలో పంచుకొని ఉంటాడని ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. అదే నిజమైతే ఐపీఎల్ 2024 సీజన్ ఫస్టాఫ్ మ్యాచ్‌లకు సూర్యకుమార్ యాదవ్ పూర్తిగా దూరమయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం గాయంతో బాధపడుతున్న సూర్యకుమార్ యాదవ్ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో చికిత్స పొందుతున్నాడు. పూర్తి ఫిట్నెస్ సాధించి ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ బరిలో నిలవాలనే పట్టుదలతో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ గాయం విషయంలో బీసీసీఐ ఆదేశాల కోసమే ఎదురు చూస్తున్నామని ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మార్క్ బౌచర్ కూడా సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించాడు. ఇక ఐపీఎల్ 2024 సీజన్‌కు మార్చి 22 నుంచి ప్రారంభం కానుండగా.. మార్చి 24న గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌తో ముంబై ఇండియన్స్ తమ క్యాంపైన్‌ను ప్రారంభించనుంది.