మరో 10 రోజుల్లో ఐపీఎల్ సందడి మొదలుకానుంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభంకానుంది. ఈ మెగా లీగ్‌లో ప్రతి జట్టూ ఫేవరేటే. ఏ టీమ్‌ను తక్కువగా అంచనా వేయలేని పరిస్థితి. అయితే ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్ తగలనుంది.
విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తొలి రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. అంతేగాక మరికొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశాలూ ఉన్నాయి.
డిసెంబర్ నుంచి సూర్యకుమార్ ఆటకు దూరమయ్యాడు. స్పోర్ట్స్ హెర్నియా సమస్యతో ఇబ్బంది పడిన అతను జర్మనీలో ఈ ఏడాది ప్రారంభంలో సర్జరీ చేయించుకున్నాడు. ఆ తర్వాత మెరుగ్గా కోలుకున్నాడు. పూర్తి ఫిట్నెస్ సాధించడం కోసం తీవ్రంగా శ్రమించాడు. కానీ ఎన్సీఏ నుంచి సూర్యకుమార్‌కు ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు.