ప్రాక్టీస్ సెషన్‌లో సూర్యకుమార్ కు గాయం

ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ 2024లో సూపర్ 8 దశ మొదలుకానుంది. ఈ క్రమంలో భారత జట్టు జూన్ 20న ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడేందుకు సిద్ధమైంది. వెస్టిండీస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. దీని కోసం భారత జట్టు ఇప్పటికే ఇక్కడకు చేరుకుంది. మెన్ ఇన్ బ్లూ సోమవారం తొలి ప్రాక్టీస్ సెషన్‌లో బిజీగా కనిపించారు. స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గాయపడ్డాడు.

త్రో డౌన్‌కు వ్యతిరేకంగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, ఒక బంతి సూర్య కుడి చేతికి తగిలింది. దాని కారణంగా అతను తన ప్రాక్టీస్‌ను ఆపవలసి వచ్చింది. అయితే, గాయం పెద్దగా లేదని అంటున్నారు. మ్యాజిక్ స్ప్రే ఉపయోగించి, సూర్య మళ్లీ తన ప్రాక్టీస్ ప్రారంభించాడంట.

ఇప్పటి వరకు టోర్నీలో సూర్య బ్యాట్ నిశబ్దంగా ఉండడంతో పాటు మూడు మ్యాచ్ ల్లో 59 పరుగులు చేశాడు. అమెరికా పై అతను చేసిన అత్యధిక స్కోరు 50 అత్యధికంగా మారింది. సూర్య త్వరలో టోర్నీలో తన లయను పుంజుకుంటాడని, అతని బ్యాట్ నుంచి భారీ ఇన్నింగ్స్‌లు వస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు.

Exit mobile version