Thursday, November 21, 2024

Breaking: సూపర్​ చెన్నై, దంచికొట్టిన ఎల్లో ఆర్మీ.. బెంగళూరు మటాష్​.. 146/7

టాటా ఐపీఎల్​ 2022లో భాగంగా ముంబైలోని డీవైపాటిల్​ స్టేడియంలో ఇవ్వాల చెన్నై సూపర్​ కింగ్స్​, రాయల్​ చాలెంజర్స్​ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్​ జరుగుతోంది. అయితే తొలుత బ్యాటింగ్​ చేసిన చెన్నై జట్టు నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. పటిష్టమైన స్కోరుతో చెన్నై బెంగళూరు జట్టుకు 217 పరుగుల టార్గెట్​ పెట్టింది.. ఏ దశలోనే బెంగళూరు బౌలర్లు చెన్నైపై ప్రతాపం చూపలేకపోయారు.

చెన్నైతో జరుగుతున్న టీ20 మ్యాచ్​లో బెంగళూరు చెమటోడుస్తోంది. అతి తక్కువ స్కోరుకే కీలకమైన అయిదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇక మొన్నటిదాకా డఫ్పా ఆట ఆడిన చెన్నై టీమ్​ ఇవ్వాల చెలరేగిపోయింది. బ్యాటింగ్​, బౌలింగ్​ విభాగాల్లో అద్భతమైన ప్రదర్శన కనబరుస్తూ బెంగళూరుకు చుక్కలు చూపిస్తోంది.. 15.2ఓవర్ల వరకు 146 పరుగులు చేసిన బెంగళూరు.. కీలకమైన ఏడు వికెట్లు కోల్పోయింది. ఇంకా 28 బంతుల్లో 71 పరుగులు చేయాల్సి ఉంది..

ఇక ..బ్యాటింగ్​లోనూ బెంగళూరు తడబడుతోంది. ఓపెనర్లిద్దరితోపాటు విరాట్ కోహ్లీ (1) కూడా పెవిలియన్ చేరడంతో బెంగళూరు విజయావకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఆరంభం నుంచి క్రీజులో ఇబ్బందిగా కనిపించిన డుప్లెసిస్ (8) భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు.. ఇక విరాట్ కోహ్లీ కూడా మరోసారి షార్ట్ పిచ్ బంతికి బలయ్యాడు.

యువ ఓపెనర్ అనూజ్ రావత్ (12) క్లియర్‌గా ఎల్బీడబ్ల్యూ అవుటైనా కూడా.. రివ్యూ తీసుకున్నాడు. రీప్లేలో బంతి మిడ్ వికెట్‌ను కూల్చేదని తేలడంతో అతను నిరాశగా వెనుతిరిగాడు. ఆ తర్వాత కాసేపటికే భారీ షాట్లు ఆడుతున్న గ్లెన్ మ్యాక్స్ వెల్ (26)ను జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో 50 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన బెంగళూరు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. కాగా, 110 పరుగుల భాగస్వామ్యం వద్ద ఎస్​ ప్రభుదేశ్శాయి (34) పరుగులు చేసి అయిదో వికెట్​గా వెనుదిరిగాడు..  

Advertisement

తాజా వార్తలు

Advertisement