శ్రీలంకతో చివరి టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా అతి కష్టమ్మీద 137 పరుగులు చేసింది. పిచ్‌పై బంతి సుడులు తిరుగుతున్న క్రమంలో బ్యాటింగ్ ఇబ్బందిగా మారింది. అయితే.. స్పిన్ కు విపరీతంగా అనుకూలించిన పల్లెకెలె స్టేడియంలో లోకల్ బోయ్స్ మాత్రం ఈజీగా రన్స్ తీశారు. 138 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన శ్రీలంక టీమ్.. దీటుగా రాణించింది. టాపర్డర్ మంచి ఆటతీరుతో పరుగులు రాబట్టింది. కాగా, ఎనిమిది వికెట్ల నష్టానికి 137 పరుగులే చేయడంతో సూపర్ ఓవర్ కు దారితీసింది..
ఇక.. ఆఖరి ఓవర్ వరకు మ్యాచ్ రసవత్తరంగా సాగింది. 19వ ఓవర్‌లో రింకూ సింగ్ పట్టిన క్యాచ్‌తో ఆట మలుపుతిరిగింది. దీంతో 20వ ఓవర్‌లో ఆరు బంతులకు, ఆరు పరుగులు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలో సూర్యకుమార్ వేసిన ఓవర్ ప్రారంభంలోనే ఏడో వికెట్, ఆ తర్వాత మరో వికెట్ కోల్పోవడంతో లంక కష్టాల్లో పడింది. కెప్టెన్ సూర్య బౌలింగ్‌లో కేవలం అయిదు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీసుకోవడం హైలైట్.. దీంతో స్కోర్ సమానం కావడంతో పరిస్థితులు సూపర్ ఓవర్‌కు దారితీశాయి.. కాగా, సూపర్ ఓవర్‌లో శ్రీలంక రెండు వికెట్ల నష్టానికి కేవలం 2 పరుగులు మాత్రమే చేసింది.. ఇక.. టీమిండియా.. ఒకే బంతికి 4 పరుగులు ఈజీగా చేసి, మూడు టీ20లను గెలుచుకుని, టీమిండియా సూపర్బ్‌గా సిరీస్ ను సొంతం చేసుకుంది.
శ్రీలంక జట్టులో.. పతుం నిశాంక (26), కుశాల్ మెండిస్ (43), కుశాల్ పెరెరా (46) పరుగులతో రాణించారు.. ఇక. హసరంగ (3), అసలంక (0), రమేశ్ మెండిస్ (3), కామిందు మెండిస్ (1) పరుగు మాత్రమే చేశారు.
కాగా, అంతకుముందు టీమిండియా ఇన్నింగ్స్ లో ఓపెనర్ శుభ్ మాన్ గిల్ చేసిన 39 పరుగులే అత్యధికం. లోయరార్డర్ లో రియాన్ పరాగ్ 26, వాషింగ్టన్ సుందర్ 25 పరుగులు చేయడంతో టీమిండియాకు ఆ మాత్రమైనా స్కోరు వచ్చింది. యశస్వి జైస్వాల్ (10), సంజూ శాంసన్ (0), రింకూ సింగ్ (1), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (8), శివమ్ దూబే (13) నిరాశపరిచారు. శ్రీలంక బౌలర్లలో మహీశ్ తీక్షణ 3, వనిందు హసరంగ 2, చమిందు విక్రమసింఘే 1, అసితా ఫెర్నాండో 1, రమేశ్ మెండిస్ 1 వికెట్ తీశారు.