Tuesday, November 19, 2024

Super Victories – ప్ర‌పంచ‌క‌ప్ లో పాక్ పై ఎదురులేని భార‌త్ – ఆడిన ఏడు మ్యాచ్ ల‌లోనూ టీమ్ ఇండియా ఘ‌న విజ‌యం

అహ్మదాబాద్‌: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌-2023లో అసలుసిసలైన సమరానికి సమయం ఆసన్నమైంది. క్రికెట్‌ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న దాయాదుల పోరు భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ నేడు (శనివారం) అహ్మదాబాద్‌లో జరగనుంది. వరల్డ్‌కప్‌ ఆరంభమై దాదాపు 10 రోజులు అవుతుంది కానీ అసలుసిసలైన హై ఓల్టేజ్‌ మ్యాచ్‌ మాత్రం ఈరోజు నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 2 గంటల నుంచి మొదలు కానుంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీలో ఇరుజట్లు శుభారంభం చేశాయి. టీమిండియా వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి జోరును ప్రదర్శించగా.. పాక్‌ కూడా రెండు విజయాలనుందుకుని దూకుడుగా ముందుకు సాగుతోంది. అయితే ఈసారి కూడా దాయాదుల పోరులో టీమిండియా హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది.

పాక్ పై భార‌త్ అజేయం..

ప్రపంచకప్‌లో భారత్‌-పాక్‌లు 1992 నుంచి 2019 వరకు మొత్తం ఏడుసార్లు తలపడ్డారు. అందులో అన్ని సార్లు కూడా భారత జట్టే గెలిచింది. 1992- వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో భారత్‌ పాక్‌లు తొలిసారి 1992లో తొలిసారి తలపడ్డా యి. సిడ్నీ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటిం గ్‌ చేసిన టీమిం డియా నిర్ణీత 49 ఓవర్లలో 216/7 పరుగు లు చేసింది. సచిన్‌ టెండూల్కర్‌ (54 నాటౌట్‌), అజయ్‌ జడేజా (46), రాణించారు. అనంతరం లక్ష్యఛే దనకు దిగిన పాకిస్తాన్‌ భారత బౌలర్ల ధాటికి 173 పరుగు లకే కుప్పకూలింది. కపిల్‌ దేశ్‌, మనోజ్‌ ప్రభాకర్‌, జవగళ్‌ శ్రీనాథ్‌ తలో రెండు వికెట్లు తీశారు. దాంతో భారత్‌కు 43 పరుగుల విజయం లభించింది.

1996- భారత్‌ వేదికగా 1996లో జరిగిన ప్రపంచకప్‌ లో దాయాదులు రెండో క్వార్టర్‌ ఫైనల్లో తలపడ్డారు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌ నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధు (93; 115 బంతుల్లో 11 ఫోర్లు), అజయ్‌ జడేజా (25 బంతుల్లో 45) రాణించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 287/8 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో వెంకటేశ్‌ ప్రసాద్‌, అనిల్‌ కుంబ్లే చెరో 3 వికెట్లతో విజృంభించడంతో పాక్‌ 9 వికెట్ల నష్టానికి 248 పరుగులే చేయగలిగింది. దీంతో భారత్‌ 39 పరుగులతో విజయం సాధించింది.

1999- భారత్‌-పాకిస్తాన్‌ మూడోసారి ప్రపంచ కప్‌ సమరంలో తలపడ్డాయి. ఈసారి కూడా మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 50 ఓవర్ల లో 6 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. రాహుల్‌ ద్రవిడ్‌ (61), అజారుద్దీన్‌ (59) హాఫ్‌ సెంచ రీలతో చెలరేగారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన పాక్‌ జట్టుపై పేసర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ (5/27) తన విశ్వ రూ పం ప్రదర్శించాడు. దాంతో పాక్‌ జట్టు 180 పరుగులకే ఆలౌటైంది. భారత్‌కు 47 పరుగుల విజయం దక్కింది.
2003లో భారత్‌ 6 వికెట్లతో పాకిస్తాన్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ 237/7 స్కోరు చేయగా.. అనంతరం లక్ష్యఛేద నకు దిగిన టీమిండియా 45.4 ఓవర్లలో 276/4తో ఘన విజయాన్ని అందుకుంది.

2011- భారత్‌ వేదికగా జరిగిన ఈ ప్రపంచక ప్‌లో టీమిండియా-పాకిస్తాన్‌లు సెమీస్‌లో పోటీ పడ్డాయి. మొదట బ్యాటింగ్‌ చేసిన ధోనీ సారథ్యంలోని భారత జట్టు 260/9 స్కోరు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన పాక్‌ భారత బౌటర్ల ధాటికి 231 పరుగులే చేయగలిగింది. దీంతో టీమిండి యా 29 పరుగులతో గెలిచి ఫైనల్‌కు దూసు కెళ్లింది. ఇక ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసి 28 సంవత్సరాల తర్వాత రెండోసారి విశ్వవిజేతగా అవతరించింది.

- Advertisement -

2015- ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ (107; 126 బంతుల్లో 8 ఫోర్లు) శతకం బాదగా.. సురేశ్‌ రైనా (56 బంతుల్లో 74), శిఖర్‌ ధావన్‌ (73) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. దీంతో టీమిండియా 300/7 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం షమీ (4/35) విజృంభించడంతో లక్ష్యఛేదనకు దిగిన పాక్‌ 47 ఓవర్లలో 224 పరుగులకే చాప చుట్టేసింది. దాంతో భారత్‌కు 76 పరుగుల విజయం సొంతమైంది.

2019- చివరిసారి జరిగిన ప్రపంచకప్‌లో తొలు త బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత ఓవర్లో 336/5 స్కోరు చేసింది. రోహిత్‌ శర్మ (140; 113 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లు) వీరోచిత శతకం నమోదు చేయగా.. కోహ్లీ 65 బంతుల్లో 77 పరుగులు చేశాడు. తర్వాత ఛేదనకు దిగిన పాక్‌ 40 ఓవర్లలో 212/6 చేసింది. ఈ దశలో వర్షం కారణంగా మ్యాచ్‌ ఆగిపోయింది. తర్వాత మ్యాచ్‌ సాధ్యపడకపో వడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకా రం భారత్‌ 89 పరుగులతో విజయాన్ని అందుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement