Friday, November 22, 2024

IPL | చెన్నైలో ‘సూపర్’ కింగ్స్​.. రుతురాజ్​కి ఆరెంజ్​ క్యాప్​

లక్నో సూపర్​ జెయింట్స్​తో జరిగిన మ్యాచ్​లో చెన్నై సూపర్​ కింగ్స్​ అద్భుతమైన ఆటతీరు కనబరిచింది. అటు బ్యాటింగ్​, ఇటు బౌలింగ్​ విభాగంలో మెరుగైన ప్రదర్శన చూపింది. దీంతో సొంత మైదానంలో అభిమానుల సందడి మధ్య విజయపతాక ఎగరేసింది. తొలుత టాస్​ గెలిచిన లక్నో బౌలింగ్​ ఎంచుకుని చెన్నైని బ్యాటింగ్​కు ఆహ్వానించింది. దీంతో చెన్నై ఓపెనర్లు రుతురాజ్​ గైక్వాడ్​ (57), డేవాన్​ కాన్వే (47) మంచి ఆరంభాన్ని ఇచ్చారు.  ఆ తర్వాత వచ్చిన ప్లేయర్లు కూడా తమదైన శైలిలో దూకుడుగా ఆడి స్కోరు బోర్డుని పరుగులు పెట్టించారు. ఏడు వికెట్ల నష్టానికి చెన్నై జట్టు 217 పరుగులు చేసింది. ఈ క్రమంలో ధోనీ ఆడిన మూడు బంతుల్లో రెండింటిని సిక్స్​లుగా కొట్టడంతో అభిమానుల ఆనందానికి అంతులేకుండా పోయింది. కాగా, ధోనీ కొట్టిన సిక్స్​ ఈ సీజన్​లో 100వ సిక్స్​ కావడం కూడా ఇక్కడ మరో హైలైట్​గా నిలిచింది.

కాగా, సెకండ్​ బ్యాటింగ్​కు దిగిన లక్నో జట్టు తామేమీ తక్కువ కాదన్నట్టు దూకుడుగా ఆడింది. 5 ఓవర్లలోనే 100 పరుగులు చేసి చెన్నైని ఒక దశలో బెంబేలెత్తించింది. అయితే ఆ తర్వాత మిస్టర్​ కూల్​ కెప్టెన్​ ధోనీ స్పిన్నర్లను రంగంలోకి దించడంతో లక్నో ఆటలు సాగలేదు. దీంతో వరుసగా వికెట్లు టపటపా పడేసుకుని చిక్కుల్లో పడిపోయింది. తర్వాత కూడా ఆ జట్టులోని స్టోయినీస్​ (21), నికోలస్​ పూరన్​ (32), ఆయుష్​ బదానీ (23), గౌతమ్ ​17 మంచి ఆటతీరు కనబరిచారు. 205పరుగులు చేసినా టార్గెట్​ పెద్దది కావడం, సరిపోను బాల్స్​ లేకపోవడంతో లక్నో ఓటమి తప్పలేదు. ఈ క్రమంలో చెన్నై 12 పరుగుల తేడాతో విజయం సొంతం చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement