Sunday, September 8, 2024

Super 8 – ఫిల్‌ సాల్ట్‌ విధ్వంసం – విండీస్ పై ఇంగ్లండ్‌ ఘన విజయం

టి 20 ప్రపంచకప్‌-2024 సూపర్‌-8 దశలో ఇంగ్లండ్‌ శుభారంభం చేసింది. సెయింట్‌ లూసియా వేదికగా ఆతిథ్య వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది.

181 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లీష్‌ జట్టు ఊదిపడేసింది. ఇంగ్లండ్‌ 17.2 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 47 బంతులు ఎదుర్కొన్న సాల్ట్‌.. 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 87 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.

అతడితో పాటు జానీ బెయిర్‌ స్టో(48 నాటౌట్‌), కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌(25) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. ఇక విండీస్‌ బౌలర్లలో రస్సెల్‌, ఛేజ్‌ తలా వికెట్‌ సాధించారు.

- Advertisement -

కాగా అంతకముందు బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.విండీస్‌ బ్యాటర్లలో చార్లెస్‌(38) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. పూరన్‌(36), పావెల్‌(36), రుథర్‌ఫార్డ్‌(28) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో అర్చర్‌, కుర్రాన్‌, మొయిన్‌ అలీ తలా వికెట్‌ సాధించారు.:

Advertisement

తాజా వార్తలు

Advertisement