టాస్ గెలిస్తే బ్యాటింగ్ కు మొగ్గు
మరోసారి ఉప్పల్ వేదికలో సిక్సర్ల జోరు
విజయం కొసం ఆర్సీబి పోరాటం
ఐపీఎల్ 17వ సీజన్‌లో వరుస విజయాల తో జోరుమీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో భారీ విజయంపై కన్నేసింది. ఈ సీజన్‌లో విధ్వంసకర బ్యాటిం గ్‌తో ప్రళయం సృష్టిస్తున్న హైదరాబాద్ బ్యాటర్లు మరో భారీ టార్గెట్‌పై కన్నేశారు. ఇప్పటికే మూడు సార్లు 250 ప్లస్ పరుగులు నమోదు చేసిన ఎస్‌ఆర్‌హెచ్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు (287) నమోదు చేసి సంచలనం సృష్టించింది. ఇప్పుడు అదే జోష్‌తో ఈసారి సొంతమైదానం లో బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో 300 పరుగుల టార్గెట్‌ను అందుకోవాలని హైదరాబాద్ బ్యాటర్లు చూస్తున్నా రు.
నేడు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూ రుతో తలపడనుంది. తాజా ఎడిషన్‌లో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ 5 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు వరుసగా విఫలమవుతున్న బెంగళూరు జట్టు ఆడిన 8 మ్యాచుల్లో ఒక్కటే విజయం సాధించి మిగతా 7 మ్యాచుల్లో ఓడింది. పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానంలో నిలిచింది. ఆర్సీబీ నాకౌట్ చేరే అవకాశాలు కూడా దాదాపూ ముసుకుపోయాయి. ఇక ఇరు జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్‌లో హైదరాబాద్ 25 పరుగు లతో విజయం సాధించింది. బెంగళూరు వేదికగా జరిగిన ఆ మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలోనే హైలైట్‌గా మారిం ది.
తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (287/3) ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసి చేసి కొత్త చరిత్ర సృష్టించింది. ఎస్‌ఆర్‌హెచ్ తొలి పరవ్ ప్లే (6 ఓవర్లు)లో ఏకంగా 125 పరుగులు బాదీ కొత్త చరిత్ర లిఖించుకున్నారు. తర్వాత ఐదు ఓవర్లలోనే 100 పరుగుల మార్కును పూర్తి చేసి ఇంకో రికార్డు నమోదు చేశారు. అయితే ఈ ఘమ్యాచ్‌లో భ 300 పరుగులు దాటుతుందేమోనని అందరూ భావించారు. కానీ చివర్లో ఢిల్లి బౌలర్లు పుంజుకో వడంతో హైదరాబాద్ టోర్నీ నాలుగో అత్యధికమైన 266 స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఢిల్లి క్యాపిటల్స్ 199 పరుగులకే పరిమిత మవడంతో సన్‌రైజర్స్‌కు 67 పరుగులతో వరుసగా నాలుగో విజయం దక్కింది.
ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన ఓపెనర్ ట్రావిస్ హెడ్ 324 పరుగులతో టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల లో మూడో స్థానంలో కొనసాగు తున్నా డు. అందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. హెడ్ ఇప్పటివరకు 39 ఫోర్లు, 18 సిక్సర్లు బాదాదు. మరోవైపు ఆర్సీబీ స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లీ 379 పరుగులతో టోర్నీ టాపర్‌గా ఉన్నాడు. మొత్తంగా బ్యాటర్ల హవా కొనసాగు తున్న ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్, ఆర్సీబీలకు ఈ మ్యాచ్ ఆసక్తికరం గా మారింది. అదే ఇరు జట్ల బౌలర్లకు ఈ మ్యాచ్ పరీక్ష కానుంది. విజయమే లక్ష్యంగా ఇరుజట్లు బరిలోకి దిగుతున్నాయి.
హోం గ్రౌండ్ లో ఎదురులేని టీమ్..
ఐపీఎల్ 2024 సీజన్‌లో సగానికి పైగా మ్యాచ్‌లు పూర్తయిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ (14 పాయింట్లు), కోల్‌కతా నైట్‌రైడర్స్ (10), సన్‌రైజర్స్ హైదరాబాద్ (10), లక్నో సూపర్ జెయింట్స్ (10) జట్లు పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచి ప్లే ఆఫ్స్ రేసులో ముందున్నాయి. సీఎస్‌కే (8), గుజరాత్ (8), ముంబై ఇండియన్స్ (6), ఢిల్లీ క్యాపిటల్స్ (6) జట్లు ఐదు నుంచి ఎనిమిది స్థానాల్లో నిలిచి ప్లే ఆఫ్స్ బెర్తుల కోసం పోటీ పడుతున్నాయి. పంజాబ్ కింగ్స్ (4), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (2) చివరి రెండు స్థానాల్లో ఉంటూ ప్లే ఆఫ్స్ అశలను దాదాపుగా వదులుకున్నాయి.
ప్రస్తుత సీజన్‌లో 39 మ్యాచ్‌ల అనంతరం ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ మినహా మిగతా తొమ్మిది జట్లు తమతమ సొంత మైదానాల్లో పరాజయాలు ఎదుర్కొన్నాయి. ఒక్క సన్‌రైజర్స్ మాత్రమే హోం గ్రౌండ్‌లో తిరుగులేని శక్తిగా ఉంది. భారీ ఫ్యాన్ బేస్ ఉన్న చెన్నై, ఆర్సీబీ, ముంబై జట్లు సైతం సొంత మైదానాల్లో ఓటములు ఎదుర్కొంటే, కమిన్స్ సేన మాత్రం సొంత అభిమానుల మధ్యలో దర్జాగా తలెత్తుకు నిలబడింది.
ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ కమిన్స్ నేతృత్వంలో మునుపెన్నడూ లేనంత పటిష్టంగా ఉంది. పటిష్టం అంటే అట్లాంటి ఇట్లాంటి పటిష్టం కాదు. ఐపీఎల్ పునాదులు దద్దరిల్లేంత పటిష్టంగా కమిన్స్ సేన ఉంది. సన్‌రైజర్స్ బ్యాటింగ్ వీరులు విధ్వంసం ధాటికి పొట్టి క్రికెట్ బ్యాటింగ్ రికార్డులన్నీ బద్దలవుతున్నాయి. వీరి దెబ్బకు ఆరెంజ్ ఆర్మీ ఈ సీజన్‌లో ఇప్పటికే మూడు సార్లు 260 ప్లస్ స్కోర్లు నమోదు చేసింది.
మరోవైపు బౌలింగ్‌లోనూ సన్‌రైజర్స్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కమిన్స్ నేతృత్వంలో సన్‌రైజర్స్ బౌలింగ్ విభాగంలో కూడా అదరగొడుతుంది. మొత్తంగా ఈ సీజన్‌లో ఆరెంజ్ ఆర్మీ పట్టపగ్లాల్లేకుండా టైటిల్ దిశగా దూసుకెళ్తుంది. నేడు జరుగబోయే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ సొంత మైదానంలో ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనూ పరుగుల వరద పారి ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కావడం ఖాయమని సన్‌రైజర్స్ అభిమానులు నమ్మకంగా ఉన్నారు.
జట్ల వివరాలు (అంచనా)
హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, మార్క్‌రమ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, నితీశ్ కుమార్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్ఖండే, నటరాజన్. ఇంపాక్ట్ ప్లేయర్: జయదేవ్ ఉనద్కాట్/ఉమ్రాన్ మాలిక్.
బెంగళూరు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, విల్ జాక్స్, రజత్ పాటిదార్, కామెరూన్ గ్రీన్, మహిపాల్ లోమ్రోర్, దినేశ్ కార్తీక్, కర్ణ్ శర్మ, ఫెర్గ్యూసన్, యష్ దయాల్, సిరాజ్.